మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వారికి ఎముకల్లో బలం తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా వీరిలో రుతుక్రమం ఆగిపోయేటువంటి దశ కూడా వస్తుంది. ఆహార పదార్థాన్ని వారు భాగం చేసుకోవడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి.
నల్ల ఎండు ద్రాక్ష - నల్ల ఎండు ద్రాక్షను బ్లాక్ రైసిన్ అని అంటారు. ఇది అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీని ద్వారా మన శరీరంలో వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
Health Tips: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది- యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా ఇది మన శరీరంలోని టాక్సిన్స్ తోటి పోరాడి వాటిని బయటికి పంపించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు వీటిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే మీరు సమస్య నుండి బయటపడతారు.
షుగర్ ని తగ్గిస్తుంది- 40 ఏళ్ళు దాటిన మహిళల్లో షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అటువంటి వారు ముందు నుండే ఈ నల్ల ద్రాక్షాను మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఇది రక్తంలోని చక్కర స్థానం నియంత్రిస్తుంది. ఇందులో మ్యాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తీసుకోవడం ద్వారా మీ షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటాయి.
బరువు తగ్గడం- చాలామంది మహిళల్లో డెలివరీ తర్వాత అధికంగా బరువు పెరుగుతారు. దీనివల్ల అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడం ద్వారా ఆకలిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది- నల్ల ఎండు ద్రాక్షలో మెగ్నీష పుష్కలంగా ఉంటుంది . ఇది నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం లోపం వల్ల చాలామందికి స్ట్రోక్, మైగ్రేన్, ఆందోళన, నిరాశ వంటివి దారితీస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఫ్రీ మోనోపాజిక్ ముందు ఇటువంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.