వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాలైన జబ్బులు వస్తాయి. అప్పుడు మనం హెల్తీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో పొట్లకాయ ప్రముఖ స్తానం ఉంది. పొట్లకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పోషకాలు: ఈ పొట్లకాయలో విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం పొటాషియం, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
బరువు: బరువు తగ్గడానికి పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల మీరు పొట్లకాయని తీసుకోవడం వల్ల మీ శరీర బరువు అదుపులో ఉండి శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. దీంట్లో ఉన్న ఫైబర్ మీకు మలబద్దక సమస్య రానీయకుండా చేస్తుంది.
జీర్ణ క్రియకు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్లకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. మీరు అజీర్తీ తో బాధపడుతున్నట్లయితే పొట్లకాయలు మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఇది చాలా మేలు చేసి గ్యాస్ ప్రాబ్లం ను, కడుపుబ్బరం, వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Health Tips: నేరేడు గింజలు ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు.
గుండెకు మంచిది: పొట్లకాయలో గుండె ఆరోగ్యాన్ని పెంచే చాలా పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా బీపీని కూడా కంట్రోల్ చేయడంలో ఈ పొట్లకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎలా తినాలి
పొట్లకాయ కూర: ఉల్లిపాయలు, టొమాటోలు మసాలా దినుసులతో ద్వారా మీరు రుచికరమైన కూరగాయలను తయారు చేసుకోవచ్చు.
పొట్లకాయ ఖీర్ : పాలలో పొట్లకాయ వండుకుంటే స్వీట్ ఖీర్ తయారవుతుంది. దానికి పంచదార, దాల్చిన చెక్క, బెల్లం కలిపితే రుచి పెరుగుతుంది.
పొట్లకాయ కోఫ్తాలు: పొట్లకాయను బాల్స్ చేసి బంగాళదుంప లేదా టొమాటో గ్రేవీలో ఉడికించి రుచికరమైన కోఫ్తాలను తయారు చేసుకోవచ్చు.
పొట్లకాయ రైతా: పొట్లకాయను పెరుగుతో కలిపి అన్నం లేదా పరాటాతో సర్వ్ చేస్తే రైతా తయారవుతుంది.
ఈ పద్ధతులతో మీరు పొట్లకాయను రుచికరంగా తయారు చేసుకోవచ్చు దాని నుండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీ ఆహారంలో పొట్లకాయను చేర్చుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దాని ప్రయోజనాలను పొందవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.