Garlic (Credits: X)

వెల్లుల్లి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి వంటల్లో వెల్లుల్లిని మనం వాడుతూ ఉంటాము కేవలం వంటల్లోనే కాదు పచ్చి వెల్లుల్లిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడుపుతోటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మీరు ఊహించలేనని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం ద్వారా మీలో రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. చాలామంది ఎనీమియా సమస్యతో ఇబ్బంది పడతారు. అలాంటి వారికి ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నట్లయితే మీలో రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీని ద్వారా తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాల వంటి వాటిని తగ్గించడంలో ఈ వెల్లుల్లి సహాయపడుతుంది. మీరు ప్రతి రోజు రెండు వెల్లుల్లి తీసుకున్నట్లయితే మీలో వచ్చే మలేరియా, డెంగ్యూ వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి.

వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ తగ్గించే తత్వం కూడా ఉంది. హాట్ బ్లాక్స్, గుండె సంబంధం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మీరు పరగడుపున రెండు వెల్లుల్లి తీసుకున్నట్లయితే మీలో గుండె సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అంటే కాకుండా కొలెస్ట్రాల్ సమస్య నుంచి బాధపడేవారు కూడా దీన్ని తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి ఈ వెల్లుల్లి సహకరిస్తుంది.

Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.

మీకు తలనొప్పిగా అనిపించినప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని తలనొప్పి ఉన్నచోట ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకున్నట్లయితే మీకు తలనొప్పి అనేది తగ్గిపోతుంది.

చాలామంది కాళ్ళ పగుళ్ల సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారు కూడా వెల్లుల్లిని క్రష్ చేసి ఆ పేస్ట్ ని పగిలిన పాదాల పైన పెట్టినట్లయితే మీ పాదాల పగుళ్లు తొందరగా తగ్గిపోతాయి.

చాలామందికి నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారు వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసుకుని నూనెలో వేసుకొని ఆ నూనెని కాళ్లకు మర్దన చేసుకున్నట్లయితే మీకు ఈజీగా నిద్ర పడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.