చాలామంది సాయంత్రం టీ సమయంలో మిక్సర్, స్నాక్స్, బిస్కెట్ల వంటివి ఎక్కువగా తీసుకుంటారు. అయితే టీ తో కలిపి ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. టీతోపాటు ఈ ఆహార పదార్థాల కలయిక వల్ల మన శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్ణం- టీ తో మిక్సర్, సాల్ట్, బిస్కెట్స్ మసాలా ఉన్న పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపుతుంది. టీ ,ఉప్పు కలిపి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీకు అజీర్ణం ఏర్పడి కడుపుబ్బరం ఏర్పడతాయి. ఒక్కొక్కసారి వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి టీ తో కలిపి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
విరోచనాలు- టీ లో ఉండే కెఫెన్ ,టానిన్ల వల్ల ఉప్పులో ఉండే సోడియం కలయిక వల్ల మీ జీర్ణ వ్యవస్థాపన ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కోసారి కడుపుబ్బరాన్ని కలిగించి మీకు విరోచనాలు కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది.
Health Tips: కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా
ఎసిడిటీ పెరుగుతుంది- మీరు టీ తో నూనెల వేయించిన పదార్థాలు సాల్టీ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ప్రేగులకు మంచిది కాదు- మీరు తీసుకునే స్నాక్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. టి ,సాల్ట్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా మన లోపల ఉన్న ప్రేగులకు ఇబ్బంది కలిగిస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.