Almonds

డ్రై ఫ్రూట్స్ లో మొదటి స్థానంలో బాదం ఉంటుంది. బాదం పోషకాహారంలో మొదటి స్థానంలో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు నుండి మనం బయటపడవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు రోజూ ఎన్ని బాదం తినాలో ఈరోజు మనం తెలుసుకుందాం. పిల్లలు పెద్దలు అందరు కూడా డ్రై ఫ్రూట్స్ ని రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. నానబెట్టిన బాదం లో తినడం ద్వారా అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా అందుతాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్  వంటివి పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

రోజుకు ఎన్ని బాదాములు తినాలి

ఆరోగ్యంగా ఉండాలి అంటే పెద్దవారు రోజుకు 20 బాదం పప్పులను తినవచ్చు. అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారానికి ముందు నానబెట్టిన బాదం గింజలను తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

పిల్లలు ప్రతిరోజు మూడు నుండి ఐదు బాదం పప్పులు తినవచ్చు. వీరికి కూడా నానబెట్టిన బాదం గింజలను ఇచ్చినట్లయితే వీరు ఆరోగ్యంగా ఉంటారు.

Health Tips: మీ పిల్లలకు పిజ్జా బర్గర్లు ఇస్తున్నారా.

బాదంపప్పు అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు

బరువు పెరగడం-  100 గ్రాముల బాదంలో 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో మోనో అండ్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. అందువల్ల బాదంపప్పును ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

కిడ్నీ స్టోన్స్- బాదం లో కూడా ఎక్కువగా తినేవారిలో ఈ సమస్య ఏర్పడుతుంది.

మలబద్ధకం- బాదంపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తిని సరిగ్గా నీళ్లు తాగకపోతే కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. బాదం తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగడం చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.