kids bp

అధిక రక్త పోటు తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను మీరు ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే మందులు మాత్రమే కాకుండా కొన్ని ఆహారాలు కూడా మీ బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్రూట్- బీట్రూట్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీకు రక్త వృద్ధి జరుగుతుంది. దీనిద్వారా రక్తనాళాలలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దీని ద్వారా మీకు అధిక రక్తపోటు తగ్గుతుంది. బీట్రూట్లో నైట్ రేట్లు ఉంటాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ గా మారి మన రక్తపోటును తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా బీట్రూట్ ని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆకుకూరలు- ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం మెగ్నీషియం వంటివి మూలకాలు అనేకం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు మీరు ఆహారంలో ఆకుకూరలను ఉండేలా చూసుకోవాలి.

వెల్లుల్లి-  ప్రతిరోజు తినడం ద్వారా మీ రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గి అవి విస్తరించడానికి సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా మీ బీపీ తగ్గుతుంది.

అరటిపండు- అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అది కరెక్ట్ పోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీ రక్తపోటు తగ్గుతుంది. అరటిపండు అనేది అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడేస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు ఒక అరటిపండును తీసుకుంటే ఇది మీ అధిక రక్తపోటుకు చక్కటి పరిష్కారంగా ఉంటుంది.

Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా.

కరివేపాకు- కరివేపాకు ప్రతిరోజు నాలుగు ఆకులను ఉదయాన్నే తినడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కరివేపాకు ఆకుల్లో రక్తపోటు తగ్గించే అనేక ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. కరివేపాకును ప్రతిరోజు తీసుకోవడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది

మీరు మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలలో చేర్చుకోవడం ద్వారా మీ అధిక రక్తపోటు తగ్గుతుంది అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఎల్లప్పుడూ డాక్టర్ తో చెక్ అప్ చేయించుకోవడం కూడా ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.