Sleepless (Credits: X)

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం ద్వారా అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, BP పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి. తెల్లవారుజామున నిద్రలేచిన వారితో పోలిస్తే రాత్రి ఎక్కువ సేపు లేటుగా పడుకునే వారిలో 50% జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే అనర్ధాలు ఏంటో జబ్బులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె జబ్బులు- రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో గుండె జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణము, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. శరీరంలో కొవ్వు కూడా పేరుకు పోతుంది. దీనికి కారణంగా వీరికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా

మధుమేహం- రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరిలో జీవన శైలిలో మార్పు కారణంగా ఒత్తిడి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

 లివర్ సమస్యలు- రాత్రను ఎక్కువసేపు మేల్కొని వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. వీరి లివర్లో కొవ్వు శాతం పెరిగి అనేక రకాలైనటువంటి జబ్బులకు కారణం అవుతుంది. కామెర్లు, మూత్ర సంబంధ సమస్యలు  వంటి జబ్బులు వస్తాయి.

వీటిని నివారించే మార్గాలు.

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని నియంత్రించడానికి మీరు సరైన జీవనశైలిని అనుసరించాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ సంప్రదించి మీ హెల్త్ చెకప్ చేసుకుంటూ రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేస్తే ఇటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.