sugar

కొన్ని సంకేతాల వల్ల మన శరీరంలో కొన్ని జబ్బులు వస్తాయని మనం ముందే గుర్తించవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలు గనుక మీ శరీరంలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిక్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచుగా మూత్ర విసర్జన- రక్తం షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే మూత్రపిండాల ద్వారా దాన్ని బయటికి పంపించాలని చూస్తుంది. దీనికోసం ఎక్కువ నీరును తీసుకుంటుంది. దీనివల్ల మీకు అధికంగా మూత్ర విసర్జన వస్తుంది. అయితే మీరు మునపటి కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతున్నట్లయితే ఇది  డయాబెటిక్ లక్షణంగా చెప్పవచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించగలడం ముఖ్యం.

Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..

బలహీనం- మన శరీరంలో చక్కెర శాతం పెరిగినప్పుడు అది శక్తిగా మారినప్పుడు మన శరీరం చాలా అలసటగా బలహీనంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. ఎంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా శరీరం ఎల్లప్పుడు కూడా నీరసంగా ఉంటుంది. దీన్ని కూడా డయాబెటిక్ లక్షణంగా చెప్పవచ్చు.

దృష్టిలోపం- మీ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు అది కళ్ళ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ దృష్టిలో గనక లోపాలు త్వర త్వరగా కనిపించినట్లయితే అంతేకాకుండా మీకు చూపు చాలా తొందరగా మస్కబారుతున్నట్లు అనిపించినట్లయితే అది కూడా షుగర్ సంకేతంగా చెప్పవచ్చు.

గాయాలు త్వరగా మానకపోవడం- ఏదైనా చిన్న గాయమైనప్పుడు అది తొందరగా మానకుండా ఎక్కువ రోజులు అలాగే ఉంటే అది డయాబెటిక్ సంకేతంగా చెప్పవచ్చు.

తరచుగా ఆకలి వేయడం- తిన్న వెంటనే మరలా మరలా ఆకలి వేయడం ఏది తిన్నా కూడా ఇంకా తినాలనిపించడం కూడా షుగర్ ప్రాణమ లక్షణంగా చెప్పవచ్చు. మీ శరీరంలో ఉన్న గ్లూకోజు శరీరానికి అంతగా ఉపయోగపడనప్పుడు తరచుగా మళ్ళీ మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇది కూడా షుగర్ లక్షణంగా చెప్పవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి