ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ సమయం చాలా ముఖ్యమైనది. వీరు చేసే ప్రతి పని కూడా కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకు సరిగ్గా పోషక ఆహారం అందకపోతే పిల్లల్లో ఎదుగుదల ఉండదు. అంతేకాకుండా అతిగా తినడం కూడా మంచిది కాదు. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. గర్భధారణ సమయంలో పుట్టబోయే బిడ్డ జీవితానికి గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్లు మినరల్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు వాటర్ కంటెంట్ ను కూడా ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. గర్భధారణ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.
తాజా పండ్లు: గర్భధారణ సమయంలో తాజా పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆపిల్, నారింజ, వాటర్ మిలన్ ,అరటిపండు తీసుకోవడం ద్వారా మీరు మీ బిడ్డకు పోషకాలు అందించిన వారు అవుతారు.
ప్రోటీన్ ఆహారాలు: గర్భధారణ సమయంలో ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీని ద్వారా మీ బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్యాల్షియం ఎక్కువగా ఉన్న, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న, పాలు, పెరుగు ,చేపలు, చికెన్, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకుంటే మీకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్ అన్ని కూడా అందుతాయి.
డ్రై ఫ్రూట్స్: గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్లో తక్కువ క్యాలరీలో ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు ఫైబర్ అందుతుంది. విటమిన్స్, మినరల్స్ అందుతాయి, అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ లో సహజ చక్రలో ఉంటాయి కాబట్టి ఇవి ఎటువంటి సమస్యను తీసుకురావు.
Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా
లిక్విడ్స్: గర్భధారణ సమయంలో మన శరీరం ఎక్కువగా హైడ్రేట్ గా ఉండాలి. క్రమం తప్పకుండా మనం లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా మీకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. ముఖ్యంగా నీటి కంటే బదులుగా మజ్జిగ, తాజా పండ్లు, కొబ్బరినీరు, బార్లీ నీరు ఇవి తీసుకోవడం ద్వారా మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవాలి: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. వీరు తరచుగా మూడు స్వింగ్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు కాసేపు ధ్యానం, మెడిటేషన్ ,మంచి మ్యూజిక్ వినడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.