కొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది మన శరీరంలో ఏర్పడే కొన్ని అనారోగ్య లక్షణాలకు సంకేతంగా మనం చెప్పవచ్చు.
జీర్ణ సమస్యలు: ఎటువంటి సమస్యలు లేకుండా నోటి దుర్వాసన వచ్చినట్లయితే మీలో జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నట్లు .మీరు తీసుకునే ఆహారము సరిగ్గా జీర్ణం కాక తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనివల్ల నోటి నుంచి పుల్లటి తేనుపులతో పాటు వాసన కూడా వస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కోసం మీరు ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేకాకుండా పుల్లటివి, మాంసాహారం వంటి అసిడిక్ నేచర్ కలిగించే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఇన్ఫెక్షన్స్: కొంతమందిలో కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వారి శ్వాస కోశాల్లో బ్యాక్టీరియా వైరల్, ఫంగల్, పెరుగుతాయి దీని ద్వారా వారికి నిమోనియా వంటి జబ్బులు రావచ్చు. అలాంటప్పుడు కూడా వీరి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకుంటే సమస్య తెలుస్తుంది.
Health Tips: మీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ సమస్యలు: కిడ్నీ జబ్బులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన సమస్య అనేది ఏర్పడుతుంది. వాళ్ళ కిడ్నీలు పనితీరులో ఏదైనా ఆటంక కలిగినప్పుడు వారి శరీరంలో వ్యర్ధాలు నిలిచిపోతాయి. దీని ద్వారా కూడా మీకు నోటి దుర్వాసన వస్తుంది.
షుగర్: షుగర్ వ్యాధి ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన సమస్య అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వీరు తీసుకునే మెడిసిన్స్ వల్ల అంతేకాకుండా వీరి శరీరంలో ఏర్పడినటువంటి కీటోన్ల ద్వారా ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ గా కూడా మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
లివర్ జబ్బులు: కొంతమందిలో కాలేయ సమస్య, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ నోటి దుర్వాసన సమస్య అనేది తలెత్తుతుంది, కాబట్టి వీరు కూడా రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించాలి ,నోటి దుర్వాసనను వచ్చినప్పుడు మౌత్ వాష్ లను వాడాలి.
సమస్య మరి ఎక్కువైనపుడు దంత వైద్యులను సంప్రదించి దానికి తగినంత మెడిసిన్స్ యూస్ చేయాలి. లేదా ఇతర జబ్బులకు ఏమన్న కారణంగా ఈ నోటి దుర్వాసన వస్తుందో లేదో ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.