ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ మన శరీర భాగాలు అన్నిటికి అందదు. దీనివల్ల నీరసము, కళ్ళు తిరగడం వంటి అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఐరన్ లోపం తెలుసుకోవడానికి ఈ క్రింది లక్షణాలు ఈ సంకేతాలు కనిపిస్తాయి.
ఇన్ఫ్లమేషన్: మీ శరీరంలో ఐరన్ లోపం ఉంటే మీకు శరీరంలో కాళ్లు, చేతులు మొహం అన్నీ కూడా వాపు కనిపిస్తాయి. మన శరీరానికి తగినంత హిమోగ్లోబిన్ అందదు. కాబట్టి మన శరీర భాగాలు వాపుకు గురవుతాయి.
ఆకలి లేకపోవడం: మీ శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లయితే మీకు ఆకలి వేయదు. ఎక్కువగా పచ్చళ్ళు తినడానికి ఇష్టపడుతుంటారు. దీని ద్వారా మీ శరీరానికి పోషణ లభించకపోవడం వల్ల మీరు కడుపునొప్పి గ్యాస్టిక్ సమస్యలకు కూడా దారి తీస్తుంది.
అలసట నీరసం, ఐరన్ లోపం వల్ల మనము ఏ పని కూడా సరిగ్గా చేయలేము. తీవ్ర నీరసంగా అనిపిస్తుంది. శరీరం శక్తి అంత కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు తిరగడము అలసటగా ఏ చిన్న పని కూడా చేయలేకపోవడం ఏ ఐరన్ లోపం లక్షణాలు.
Health Tips: కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు తేలిస్తే షాక్ తింటారు ...
కండరాల పెరుగుదలకు: అయినను మన శరీరాన్ని అన్ని అవయవాలకు కూడా చాలా ముఖ్యమైనది ఈ ఐరన్ లోపం వల్ల మన ఎదుగుదలకు ఇబ్బంది కలుగుతుంది పిల్లల్లో ఈ లోపం మరింతగా తెలుస్తుంది వాళ్లకు ఎదుగుదల ఉండదు కండరాల నొప్పులు కండరాలు పెరగకపోవడం వల్ల శరీరము సరైన విధంగా ఎదుగుదల ఉండదు.
ఇమ్యూనిటీ తక్కువ: ఐరన్ లోపం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. దీని ద్వారా మనకు రకరకాలైన ఇన్ఫెక్షన్స్ ఇబ్బందికి గురిచేస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల మనము అనేక రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి ఐరన్ లో పని తగ్గించుకోవడం కోసం మనము ప్రయత్నించాలి.
ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు.
తాజా పండ్లల్లో ,డ్రై ఫ్రూట్స్ లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది క్యారెట్ ,బీట్రూట్ దానిమ్మ, వాటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది, వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీరు ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.