Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పోషకాలతో పాటు విటమిన్లు క్యాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా తీసుకోవడం చాలా అవసరం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కండరాలలో నొప్పులు ఎముకల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఈ లోపాన్ని అధిగమించడం కోసం క్యాల్షియం సప్లిమెంట్స్ లో వాడుతూ ఉంటారు. అయితే అలా కాకుండా కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయి. దీనికి రాగిణి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు రాగిజావని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకల బలం- రాజులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. వైస్ పైబడిన వారిలో అనేక రకాల కండరాల జబ్బులు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవి తగ్గించడానికి శరీరంలో క్యాల్షియం లోపం తగ్గించడానికి రాగులు తీసుకోవడం మంచిది వీటిని ప్రతిరోజు జావ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
గుండెకు మంచిది- రాగులలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె సంబంధం సమస్యలు తొలగిపోతాయి. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ఉన్నవారికి రక్తపోటు సమస్య తగ్గుతుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
షుగర్ పేషెంట్స్ కు మంచిది- రాగుల్లో గ్లైసి మీకు ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దీని షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దేన్నీ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
రక్తహీనతకు- శరీరంలో రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు రాగులను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు దీన్ని ప్రతి రోజు చేర్చుకోవడం ద్వారా ఇందులో అనేక రకాల విటమిన్లు కూడా అందుతాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్ విటమిన్ సి అధికంగా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి