ప్రస్తుత సమయంలో చాలామంది పురుషులు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. దీనివల్ల వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. వారి స్టామినా తగ్గడం, ప్రతిదానికి నీరసంగా ఉండడం సమస్యలు వారి శృంగార జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే మెడిసిన్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే డ్రింక్ వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: మఖాన, ఖర్జూరం కొన్ని పాలు ఖర్జూరంలో కాల్షియము, జింకు ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఫుల్ మఖానాలో కూడా ప్రోటీన్లు, మినరల్స్. విటమిన్ బి 12 .కాల్షియం. అధికంగా ఉంటాయి. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా పురుషులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. పాలు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసుకొని ప్రతిరోజు ఈడ్రింక్ ని తాగినట్లయితే మగవారి శరీరంలో శక్తి పెరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
టీని మళ్లీ వేడి చేసి తాగితే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే
తయారు చేసుకునే విధానం.
ఖర్జూరాలను, మఖానను సుమారు ఒక నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో నానబెట్టుకున్న ఖర్జూరం ఫూల్మఖాన్ని వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ చేసుకొని డ్రింక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డ్రింక్ ని ప్రతిరోజు మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా తక్షణ శక్తి తో పాటు మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరం పుష్టిగా ఉంటుంది. సంతానలేమి సమస్యలు కూడా తగ్గిపోతాయి. కావాలంటే ఇందులో అశ్వగంధ పొడిని కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా రెగ్యులర్ గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శక్తి పెరగడమే కాకుండా మీరు జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ రిచ్ గా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య గ్యాస్టిక్ సమస్య కడుపుబ్బన వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అశ్వగంధ కలపడం ద్వారా ఇది స్లీపింగ్ హార్మోన్ ని పెంచుతుంది. దీని ద్వారా మీకు నిద్ర రావడానికి చాలా బాగా సహకరిస్తుంది. మానసికమైన సమస్యలను కూడా తగ్గించడంలో అశ్వగంధ ప్రముఖ స్థానంలో ఉంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.