Glowing Mushrooms in Kerala Discovered Representational Image (Photo Credits: Pixabay)

మన శరీరానికి డి విటమిన్ ఎంతో ముఖ్యం. డి విటమిన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. విటమిన్ డి తక్కువగా ఉంటే మన శరీరంలో క్యాల్షియం అబ్సార్బ్ చేసుకోదు.  అయితే డి విటమిన్ సప్లిమెంట్స్ రూపంలో కాకుండా సహజంగానే తీసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ డి చాలా అధికంగా ఉంటుంది.

పుట్టగొడుగులు: మీ శరీరంలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటే మీరు పుట్టగొడుగులను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ పుట్టగొడుగుల పైన సూర్యకాంతి వచ్చినప్పుడు అది విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు డి విటమిన్ లోపం నుండి బయటపడతారు. ఇది ఎముకలకు దంతాలకు అవసరమైన విటమిన్. పుట్టగొడుగుల్లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.  ఎముకల వ్యాధికి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో చాలా తక్కువ క్యాలరీలో ఉంటాయి.బరువు తగ్గాలనుకునే వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి సెలీనియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

షుగర్ ని కంట్రోల్ చేస్తుంది: పుట్టగొడుగుల్లో విటమిన్ డి తో పాటు షుగర్ ని కంట్రోల్ చేసేటటువంటి లక్షణం కూడా ఉంది. పుట్టగొడుగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

గుండె జబ్బులు: పుట్టగొడుగులను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇది విటమిన్ డి ని అందించడం మాత్రమే కాకుండా మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా గుండె సంబంధ వ్యాధులు తగ్గే అటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా గుండెల్లో బ్లాకులు ఏర్పడడం అంటే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి.

యాంటీ ఆక్సిడెంట్స్: పుట్టగొడుగుల్లో విటమిన్-డి మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం ద్వారా ఇది చర్మాన్ని నిగారింపుకు జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తి: పుట్టగొడుగుల్లో రోగనిరోధక శక్తిని పెంచేటువంటి బీటా గ్లూకాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

బరువు తగ్గడానికి: పుట్టగొడుగుల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి12, విటమిన్ బి, ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం ద్వారా మీరు దీన్ని ఎక్కువ తీసుకున్నట్లయితే మీ శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

గమనిక. మీ శరీరంలో విటమిన్ లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ వాడుకుంటే మంచిది అంతే కాకుండా అధిక విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు చేపలు, పుట్టగొడుగులు సోయాబీన్స్ పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తీసుకుంటే ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.