వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు మనకు సోకుతాయి. ఈ సీజన్లో లభించే కీవి పండును మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే అది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అందులో ఉన్న విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీని ద్వారా రకరకాలైన ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉన్న పోషక విలువలు
కార్బోహైడ్రేట్స్: కీవి పండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూకోజ్ ప్రక్టోజ్ సుక్ రోజులుగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఫైబర్: టీవీ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీల సమస్యలు తగ్గిపోతాయి. కడుపు నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడతారు. దీని ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని కూడా బయటికి పోయి మన ఆరోగ్యము మెరుగుపడుతుంది.
విటమిన్స్: కీవి పండులో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కె, ఇవి మూడు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, విటమిన్ ఏ మన కంటికి మన చర్మానికి చాలా మంచిది, అంతే కాకుండా బి విటమిన్ వల్ల మనకు అలసట లేకుండా ఆందోళన కలిగించకుండా ఉంటుంది, అంతేకాకుండా రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది.
మినరల్స్: కీవి పండులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మినరల్స్, అధికంగా ఉంటాయి. ఈ పొటాషియం వల్ల మన గుండె ఆరోగ్యానికి మంచిది, అంతేకాకుండా బీపీ సమస్యతో బాధపడేవారు, కీవి పండును కనుక తీసుకున్నట్లయితే మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.
మెగ్నీషియం: వల్ల మన శరీరంలో ఉన్న కండరాలకు నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐరన్ ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పరచడానికి ఉపయోగపడే మినరల్. ఇది రక్తహీనతను తగ్గించడంలో కూడా కివి పండు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
Health Tips: ఈ చెడు అలవాట్ల వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది..
యాంటీ ఆక్సిడెంట్స్: పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటి నాయిడ్స్ ఫినోలిక్ ఆసిడ్స్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన శరీరంలో వచ్చే వాపులను తగ్గించి బయటకు పంపించడంలో ఈ కీవి పండు సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.