ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మీకు గుండె జబ్బులు గుర్తించేందుకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కారణం కావచ్చు వీటిని మనం గుర్తించినట్లయితే గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు
లక్షణాలు.
మీరు నడిచేటప్పుడు అధికంగా చెమట పట్టడము ఆయసం లాగా అనిపిస్తే అది గుండె జబ్బులకు కారణం .అంతే కాకుండా చిన్న పనికి కూడా అలసటగా అనిపించడం నాలుగు మెట్లు ఎక్కగానే ఆయాసంగా అనిపించడం కూడా గుండె జబ్బుల లక్షణాలు. అంతే కాకుండా చాతి నొప్పి, బిగుసుకుపోవడం ,బరువుగా అనిపించడం వంటి కూడా వస్తాయి. అంతేకాకుండా వీటితోపాటు భుజం నొప్పి, చేతులు ,ఎడమ చేయి నొప్పి, దవడ నొప్పి ఇవన్నీ కూడా ఉండవచ్చు.
అంతేకాకుండా ఎప్పుడు కూడా మగతగా అనిపించడం, నీరసంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉన్నట్లయితే ఇది గుండె జబ్బులకు లక్షణాలు కావచ్చు. అంతేకాకుండా మీ హార్ట్ బీట్ మీకే వినిపించడం వంటివి కూడా గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఇది అతి వేగవంతంగా కొట్టుకోవచ్చు లేదా అది నెమ్మదిగా కూడా కొట్టుకోవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ ..
ఎలా రక్షించుకోవాలి: మీ శరీరంలో పైన చెప్పిన మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అంతేకాకుండా మాంసాహారము, ధూమపానము మానివేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీని ద్వారా కూడా మీరు గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. దీని ద్వారా కొలెస్ట్రాల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కేవలం సమతులన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అధికంగా వాటర్ తీసుకోవాలి దీని ద్వారా మీరు గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.