Brushing Teeth-Cancer Link (Credits: Pixbay)

పంటి నొప్పిని టూత్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మన పంటిలో నొప్పి కలుగుతుంది. ఒక్కొక్కసారి తీవ్ర నొప్పి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం.

పళ్ళను శుభ్రంగా తోముకోకపోవడం: కొంతమంది సరిగా బ్రష్ చేయని కారణంగా క్రిములు ఏర్పడి తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది. అంతేకాకుండా కొంతమంది ఎసిడిక్ ఆహార పదార్థాలు కూల్ డింక్స్ ,సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ పంటిపై ఉన్న ఎనామిల్ అనేది తొలగిపోతుంది, దాని ద్వారా మీకు ఈ పంటి నొప్పి ఎక్కువ అవుతుంది.

చిగుళ్ల వాపు: ఒక్కొక్కసారి పంటి కింద ఉన్న చిగుళ్ళు బయటకు వచ్చి వాపు ఏర్పడుతుంది. దీని ద్వారా కూడా మనం ఏదైనా చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పంటి నొప్పి తీవ్రమౌతుంది.

Health Tips: చలికాలంలో కూడా పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా ...

క్యావిటీస్: పళ్ళు పుచ్చిపోయినప్పుడు క్యావిటీస్ ఏర్పడతాయి ఈ క్యావిటీస్వల్ల కూడా పంటి నొప్పి సమస్య ఎక్కువగా అవుతుంది.

లక్షణాలు: బాగా చల్లటి ,వేడి,స్వీట్స్, సిట్రస్ ఆహారాలు తీసుకున్నప్పుడు మీ పళ్ళు తీవ్రమైన నొప్పికి గురై తీవ్ర అసౌకర్యంగా అనిపిస్తుంది. అదేవిధంగా బ్రష్ చేసేటప్పుడు కూడా చిగుళ్ల వాపు వల్ల పంటి నొప్పి పెరుగుతుంది. చల్లటి గాలి చల్లటి నీరు తాగినప్పుడు కూడా పంటి నొప్పి అధికంగా అవుతుంది. ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే మీరు టూత్ హైపర్ సెన్సిటివిటీ తో బాధపడుతున్నారు అర్థం.

చికిత్స : మార్కెట్లో కొన్ని రకాలైన సెన్సిటివ్ టూత్ పేస్ట్ లు వచ్చాయి. ఇవి దంతాలలోని నరాలకు ఇబ్బంది కలగకుండా ఉంచడంలో సహకరిస్తాయి. దీని ద్వారా మీ పంటి నొప్పి తగ్గిపోతుంది. అతిగా వేడి నీరు అతిగా చల్లటి నీరు అతిగా తీపి పదార్థాలు పదార్థాలను తగ్గించడం వల్ల కూడా ఈ పంటి నొప్పి నుంచి బయటపడవచ్చు. ఎనామిల్ మరింత దెబ్బతీయకుండా ఉండడానికి సాఫ్ట్ బ్రెజిల్ తో ఉన్న టూత్ బ్రష్ ను వాడడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. మీకు నొప్పి గనక తీవ్రమైపోయి ఎక్కువగా ఇబ్బంది పెట్టలే పెట్టినట్లయితే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

పంటిరక్షణ: పంటి నొప్పిని తగ్గించుకోవడానికి మీరు  ప్రతి రోజు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల అదే విధంగా రెండుసార్లు ప్లానింగ్ చేయడం ద్వారా మీ దంతాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా క్రమం తప్పకుండా డెంటల్ డాక్టర్ని సంప్రదించినట్లయితే ప్రారంభంలోనే వీటిని గుర్తించి చికిత్స పొందవచ్చు. ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఆహారాలను జ్యూస్ లను తగ్గించుకోవడం వల్ల కూడా దంతాలను కాపాడుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.