burning eyes

Health Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి. అంతే కాకుండా కొంతమందిలో విటమిన్ లోపం వల్ల కూడా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటి తగ్గించుకోవడం కోసం కొన్ని ఆహార పదార్థాలు కంటి చూపును పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర- పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా కళ్ళకు చాలా మంచిది ఇది కలలోపల ఉండే రెట్టినాను రక్షిస్తుంది. దీన్ని సూప్ రూపంలో లేదా కూర రూపంలో సలాడ్ రూపంలో తీసుకోవచ్చు పాలకూర రసం కూడా తీసుకోవచ్చు.

Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా

క్యారెట్- క్యారెట్లో విటమిన్ ఏ విటమిన్ బీటా కేరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మెలును కలిగిస్తాయి. విటమిన్ ఏ కంటి రెటానాను కాపాడుతుంది. అంతేకాకుండా రేచీకటి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. క్యారెట్ జ్యూస్ రూపంలో లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది కళ్లకు చాలా మంచిది.

చేపలు- చేపల్లో ముఖ్యంగా ట్యూనా సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళను కాపాడడంలో సహాయపడతాయి. పొడికలను తగ్గించి రెటీనాను కాపాడుతుంది. కంటి సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మీరు కనీసం వారంలో రెండు సార్లు అయినా సాల్మన్ లేదా ట్యూనా చేపలను తింటే కంటి సమస్యలు తొలగిపోతాయి..

కోడిగుడ్లు- కోడిగుడ్లలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, జింక్ ,ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కంటికి మేలు చేస్తుంది, జింక్ కంటి సమస్యలను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగు పరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకొని తినడం వల్ల మరిన్ని పోషకాలు కూడా అందుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి