burning eyes

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం. ఈరోజుల్లో కంటిచూపులోపం చాలామందిలో సర్వసాధారణం. అయితే కొన్ని సహజ పద్ధతుల ద్వారా మనము కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా పాటించినట్లయితే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు

కంటి చూపు తగ్గడానికి కారణాలు: కంటి చూపు తగ్గడానికి అనేక రకణాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మొబైల్ ఎక్కువగా చూడడం, లాప్టాప్ స్క్రీన్ పైన ఎక్కువ సేపు సమయం గడపడం, పోషకాహార లోపం, పెరుగుతున్న వయసు కంటిచూపులు ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా ధూమపానం, మద్యపానం, షుగర్ పేషెంట్స్ లలో ,శారీరక తక్కువ శ్రమ ఉన్నవారిలో కూడా ఈ కంటి చూపు మందగిస్తుంది. ముఖ్యంగా విటమిన్లు ,మినరల్స్ లోపం వల్ల కూడా కంటి చూపు బలహీన పడుతుంది.

కంటి చూపును పెంచే ఆహార పదార్థాలు.

క్యారెట్: క్యారెట్ మన కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం ద్వారా మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మన రెటినా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ప్రతిరోజు రెండు క్యారెట్ల తీసుకోవడం ద్వారా మీ కంటి సమస్యలు తగ్గిపోతాయి.

ఆకుకూరలు: పాలకూర ,మెంతుకూర ,తోటకూర వంటి ఆకుకూరల్లో లుటీన్ అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటే చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా మీరు ప్రతి రోజు మీ ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకుంటే మీ కంటి చూపు సమస్య నుండి బయటపడతారు.

చేపలు: చేపలలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి కండరాలను బలపరుస్తుంది. అంతేకాకుండా మన దృష్టిని పెంచుతుంది. ముఖ్యంగా మీ ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చుకుంటే మీ కంటి చూపు తగ్గడం సమస్య నుండి బయటపడతారు.

కంటి వ్యాయామం: కంటి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని కంటి వ్యాయామాలు ఉంటాయి. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీ కంటి చూపు పెరుగుతుంది. కంటి కండరాలను బలాన్ని పెంచి మీ దృష్టిని మెరుగు పరుస్తుంది.

Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా

తగినంత నిద్ర: మంచి నిద్ర మన శరీరానికే కాదు. మన కంటికి కూడా విశ్రాంతినిస్తుంది. ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోతే కళ్ళ అలసట తగ్గిపోయి మన దృష్టి మీద ప్రభావితాన్ని చూపుతుంది.

స్క్రీన్ కి దూరంగా ఉండండి: ఈ రోజుల్లో చాలామంది ఎక్కువసేపు స్క్రీన్ లను ఉపయోగించడం ద్వారా కంటి చూపు బలహీనపడుతుంది. కంప్యూటర్ మొబైల్ ఫోన్లోనే ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి స్క్రీన్ ను చూసే సమయాన్ని కాస్త తగ్గించుకొని ఉంటే మనకు కళ్ళకు ఉపశమనం కలిగి కంటి అలసట తగ్గిపోయి దృష్టిలోపం కూడా తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి