ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది మన శరీరానికి కావాల్సిన రక్తాన్ని పెంచడానికి ,మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి, గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మనకు ఐరన్, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరిసేలా చేస్తుంది. ప్రతిరోజు గుమ్మడి గింజలను తెచ్చుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
ఐరన్: గుమ్మడి గింజల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరంలో రక్తం ఏర్పడడానికి ఆక్సిజన్ సరఫరాకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉండడం వల్ల మన శరీరంలో రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది.
మెగ్నీషియం: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ఎముకలకు బలానికి కండరాల సామర్థ్యం పెంచడానికి గుండె ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మన ఆందోళనను ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాకుండా నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం.
యాంటీ ఆక్సిడెంట్స్ : గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ జింక్ వంటి అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపేలా చేస్తాయి. ఇవి మన శరీరంలో ఉన్న వృద్ధాప్య ఛాయాలను నెమ్మదిగా తగ్గిస్తుంది. దీంతో మన చర్మ ఆరోగ్యం నిహారింపును సంతరించుకుంటుంది.
Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు
ప్రోటీన్: గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకుంటే మీ శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అధిక బరువు నుండి బయట పడతారు. శాఖాహారులకు ఈ ఒక అద్భుత వరమనే చెప్పవచ్చు.
జీర్ణవ్యవస్థకు: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యల నుండి బయట పడేస్తుంది. కడుపుబ్బరం, అజీర్ణం సమస్యల నుండి బయటపడతారు.
గుండెకు మంచిది: గుమ్మడి గింజల్లో ఒమేగా త్రీ ఆసిడ్స్, ఒమేగా సిక్స్ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధ జబ్బులు అన్నిటిని తగ్గిస్తుంది. అంతేకాకుండా బిపి పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా వారి రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇమ్యూనిటీ: రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా రకరకాలైన ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల నుండి బయటపడేస్తుంది. వీటిని అల్పాహారంగా లేదా సలాడ్స్ రూపంలో లేదా వేయించుకొని చిరుతండగా తీసుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.