ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆపిల్ సైడర్ వెనిగర్లో ఆపిల్ జ్యూస్ ని ఈస్ట్ తో కలపడం వల్ల ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది. దీని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్ని ఉన్నాయి.
దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధం సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా ఎక్కువ కాలము ఆపిల్ సైడర్ వెనిగర్లు తీసుకోవడం వల్ల అది మీకు జీర్ణసంబంధ సమస్యలను కలిగిస్తుంది. ఇది అల్సర్స్ ను తయారు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకోకూడదు. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ వాడే మందులతోటి ఆపిల్ సైడర్ తీసుకున్నట్లయితే కచ్చితంగా రియాక్షన్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనితో కడుపులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: జ్ఞాపకశక్తిని పెంచే 3 సూపర్ ఫుడ్స్ ..
ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో పొటాషియం పెరుగుతుంది. దీని ద్వారా పళ్ళల్లో ఎనామిల్ డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా చిన్నపిల్లల్లో గనక ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నట్లయితే వాళ్లలో కడుపునొప్పి గొంతు మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయి.
కేవలం ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మాత్రమే ఒక గ్లాస్ నీళ్ళను వాడాలి. అంతకుమించి వాడినట్లయితే మీ శరీరంలో దద్దులు కురుపులు ఎలర్జీలు వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా మూత్ర సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి దీనిని తక్కువ పరిమాణంలో వాడడం ఉత్తమం. ఒకవేళ గనుక మీరు అంతకుమించి వాడాలి అనుకున్నట్లయితే కచ్చితంగా వైద్యుని సలహా మేరకు వాడాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.