Pregnant (File: Istock)

ప్రసవం తర్వాత చాలామంది వెంటనే వారు తిరిగి తమ శరీరాన్ని మునపటిలాగా చేసుకునేందుకు వ్యాయామం చేయాలని అనుకుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. డెలివరీ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడు వ్యాయామం ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో మార్పులు- డెలివరీ సమయంలో మన శరీరం చాలా ఒత్తిడికి గురవుతుంది. గర్భాశయం పైన అధిక ఒత్తిడి కలుగుతుంది. పొట్టలో ఉన్న కండరాలు ఒత్తిడి బలహీనంగా మారుతాయి. పొత్తికడుపు వెన్ను తుంటి ప్రాంతాలు చాలా అసౌకర్యానికి గురవుతాయి. పొట్ట ప్రాంతంలో పొత్తికడుపు ప్రాంతంలో ఉన్న కండరాలన్నీ కూడా బలహీనపడతాయి. ఈ విధంగా మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి వెంటనే మీరు డెలివరీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు.

కండరాల పైన ఒత్తిడి- డెలివరీ తర్వాత వెంటనే వ్యాయామం చేయడం వల్ల మన కండరాల పైన ఒత్తిడి ఏర్పడి ఇది ఇన్ఫెక్షన్ ,అధిక రక్తస్రావాన్ని కలిగిస్తుంది. కాబట్టి డెలివరీ తర్వాత మన శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి మన శరీరంలో ఉన్న అనేక రకాల కండరాలు అన్నీ కూడా బలహీనపడతాయి. కాబట్టి వెంటనే మీరు వ్యాయామం ప్రారంభిస్తే అదనపు ఒత్తిడి కలిగి ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

విశ్రాంతి తీసుకోవాలి- డెలివరీ డెలివరీ తర్వాత మన శరీరానికి కనీసం ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం డెలివరీ తర్వాత బలహీనపడిన కండరాలు అవయవాలు పూర్తిగా కోలుకోవడానికి వీలైనంత విశ్రాంతిని అందించడం ఎంతో ముఖ్యం.

Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా

నొప్పి ,తిమ్మిరి- డెలివరీ తర్వాత వెంటనే వ్యాయామం ప్రారంభిస్తే అనేక రకాలైనటువంటి నొప్పులు తిమ్మిరి ఏర్పడతాయి. ముఖ్యంగా నడుము కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా అయ్యి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా ద్వారా మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారు. దీని అందుకు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ఎప్పుడు వ్యాయామం ప్రారంభించాలి.

డెలివరీ తర్వాత కనీసం ఆరు వారాల తర్వాత వ్యాయామం మొదలు పెట్టాలి. ముందు తేలికపాటి నడకతో ప్రారంభించాలి. భారీ వ్యాయామాలకు దూరంగా ఉండటం ఉత్తమం శరీరం తిరిగి మునపటిలాగా అవ్వడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఈలోపు చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటే ఫిట్గా ఉండగలుగుతారు.

నెమ్మదిగా ప్రారంభించాలి- ఆరువారాల తర్వాత శరీరానికి విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా వ్యాయామం ప్రారంభించాలి. ముందుగా దీనికోసం మీ ఫిట్నెస్ ట్రైనర్ లేదా డాక్టర్ ను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం. శరీరానికి ఎక్కువ కదలికలు బరువు లేకుండా కండరాల పైన ఒత్తిడి లేకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం ముఖ్యం. శరీరానికి తగినంత పోషకాహారాన్ని అందించి మానసికమైన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ధ్యానం మెడిటేషన్ వంటివి చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి మీరు వ్యాయామాన్ని ప్రారంభించవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.