మన శరీరానికి బి12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించే ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరం ఏర్పడేటప్పుడు DNA ,RNAఏర్పడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి12 వల్ల మన మెదడు మానసిక ఆరోగ్యాన్ని చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ దీని లోపం వస్తే ముఖ్యంగా రక్తహీనత, అలసట, నరాల సంబంధ సమస్యలు కాళ్లు ,చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి.
విటమిన్ బి12 లోపం వల్ల లక్షణాలు.
మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం విటమిన్ బి12 లోపంగా చెప్పవచ్చు. దీని కారణంగా మనకు తీవ్ర అలసట బలహీనంగా ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడతాయి. విటమిన్ బి12 లోపం వల్ల కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి. అంతేకాకుండా తల తిరగడం వంటి సమస్య కూడా ఏర్పడతాయి. దీని ద్వారా మనం బ్యాలెన్సింగ్ లో ఇబ్బందిని ఎదుర్కొనవలసి వస్తుంది. అంతే కాకుండా జ్ఞాపక శక్తిలో కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల డిప్రెషన్ కి గురవుతారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆందోళన నిరాశ డిప్రెషన్కు కారణం అవుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల మన చర్మం నిగారింపును కోల్పోయి నిర్జీవంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు విపరీతంగా ఓడిపోతుంది.
ముఖ్యంగా బి12 లోపం వల్ల వల్ల మన నోటి పూత, నాలుక పైన పుండ్లు ,లాంటివి ఏర్పడతాయి.
Health Tips: పొట్లకాయ ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఒక వరం..
విటమిన్ బి12 అధికంగా ఉన్న ఆహార పదార్థాలు.
విటమిన్ బి12 అనేది ముఖ్యంగా పాలు, చేపలు, మాంసం, కోడిగుడ్లు వంటి వాటిల్లో అధికంగా ఉంటుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీలో విటమిన్ బి12 లోపం తగ్గుతుంది. ఒకవేళ మీరు తీవ్ర బి12 లోపంతో గనుక బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ఇంజక్షన్లు కూడా తీసుకోవచ్చు. విటమిన్ బి12 అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీనిలోపం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగినన్ని మందులు వాడడం మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.