చామదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ దుంప తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కొంతమందికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొన్ని జబ్బులు ఉన్నవారు ఈ చామదుంపను తీసుకోకపోవడమే ఉత్తమం. దీనివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఇది కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తీసుకొస్తుంది. ఎసిడిటీ ఉన్నవారు కూడా దీన్ని తీసుకోకూడదు. అయితే ముఖ్యంగా ఈ జబ్బులు ఉన్నవారు మాత్రం చామదుంపలకు దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీ జబ్బులు: మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు ఈ చామదుంపలు తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చామదుంపను తినకూడదు. కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా దీనిని అస్సలు తినకూడదు.
గర్భిణీలు, బాలింతలు: గర్భధారణ సమయంలో ,బాలింతలు కూడా చామదుంపను తినకూడదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇది కడుపులో ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. ఇందులో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండడం ద్వారా గర్భిణీ స్త్రీలకు ,పాలిచ్చే తల్లులకు ఇది మంచిది కాదు. గర్భిణీ సమయంలో మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అంతే కాకుండా ఇది జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కడుపులో అసౌకర్యంగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చామదుంపలను గర్భిణీలు ,పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు.
Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా
అజీర్ణ సమస్యలు ఉన్నవారు: కొంతమందిలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారి జీర్ణ క్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల అజీర్ణం, కడుపుబ్బరం ,కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అటువంటి వారు కూడా ఈ చామదుంపలను తీసుకోకూడదు. దీని ద్వారా సమస్య మరి ఎక్కువగా అవుతుంది.
షుగర్ పేషెంట్స్ తినకూడదు: షుగర్ పేషంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చామదుంపను తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతుంది. దీని ద్వారా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉండడం ద్వారా కూడా చక్కెరను పెంచడానికి ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులుచామదుంపను తీసుకోకూడదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.