154 Stones in Kidney (PIC@ google)

ఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి. ఇవి రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. మనం తీసుకున్న ఆహార పలవాట్ల ద్వారా కూడా మనకి ఇడ్లీలో రాళ్లు ఫామ్ అవుతాయి. దీని నుంచి బయటపడడానికి మనం ఈరోజు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే సరిపోతుంది.

కిడ్నీలో రాళ్లు వల్ల కలిగే ఇబ్బంది.

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మీ కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. మీరు మూత్రం పోసేటప్పుడు విపరీతమైన నొప్పి మూత్రంలో రక్తం రావడం కొన్నిసార్లు మూత్రం అసలే రాకపోవడం వంటివి సమస్యలు ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన జ్వరము, వాంతులు, విరోచనాలు అయ్యే ఎటువంటి లక్షణాలు కూడా ఉంటాయి.

అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆహారాలను తీసుకోకూడదు. దీని ద్వారా మీ కిడ్నీలో రాళ్లు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు పాలకూరను తీసుకోకూడదు. ఇందులో క్యాల్షియం ఆక్సలైట్ వంటి పదార్థం ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఆక్సలైట్ స్థాయి పెరుగుతుంది. దీని ద్వారా రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

చిక్కుడు:  చిక్కుడు జాతికి చెందిన బీన్స్, రాజ్మా, గోరుచిక్కుడు వంటి వాటిల్లో కూడా అధిక మొత్తంలో ఆక్సలైట్ ఉంటుంది. దీన్ని మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే  రాళ్లు ఏర్పడతాయి.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్: మీరు మూతపిండాల సమస్యతో బాధపడుతున్నట్లయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల మీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా

టమాట: టమాటాలో కూడా అధిక మొత్తంలో ఆక్సలైట్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు మీ కిడ్నీలో సమస్యలు ఏర్పడి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటాను తగ్గిస్తే చాలా ఉత్తమం.

దోసకాయ: దోసకాయ కూడా అధిక మొత్తంలో ఆక్సలైట్ ఉంటుంది. కాబట్టి దోసకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేము మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవడం కోసం మీరు వాటర్ ని ఎక్కువగా తీసుకోవాలి అదే విధంగా కాల్షియము ఆక్సిలేట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తగ్గిస్తే ఈ కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడతారు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి రెండు నుండి మూడు లీటర్ల నీటిని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడతారు. అంతేకాకుండా ఎక్కువగా బార్లీ నీళ్లు ఉలవచారు. వంటివి తీసుకున్నట్లయితే మీకు కిడ్నీలో రాళ్లు కరిగించడానికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.