Heart Attack. (Photo Credits: Pixabay)

ఈ మధ్య ఎక్కడ చూసిన గుండెపోటు వార్తలు వణికిస్తున్నాయి. యువత దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు గుండెపోటు బారీన పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు గుండె పోటు (heart attack) అంటే ఏమిటో చాలామందికి క్లుప్తంగా తెలియకపోవచ్చు. ఈ కథనంలో గుండెపోటు అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

గుండెపోటు... ఏదేని ఒక పరిహృదయ ధమనిలో అవరోధం కలిగిన కారణంగా హృదయ కండరం పూర్తిగా పనిచేయడం ఆగిపోవడాన్ని గుండెపోటుగా భావిస్తారు. పరిహృదయ ధమనిలో బృహద్ధమని కఠినమైన ప్లాక్‌ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టినప్పుడు సాధారణంగా గుండెపోటు వస్తుంది. గడ్డకట్టిన రక్తం ధమనిని నిరోధించడంతో పాటు దానికి రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. అలా నిలిపివేసినప్పుడు హృదయ కండరం వెంటనే ఆమ్లజని కోసం పరితపిస్తుంది. కొద్ది గంటల్లో రక్త ప్రసరణ పునరుద్ధరింపబడని పక్షంలో ఆమ్లజని అందని పక్షంలో హృదయ కండరం పూర్తిగా అచేతనావస్థలోకి వెళ్లిపోతుంది. తద్వారా గుండెపోటు వచ్చి మనిషి వెంటనే కుప్పకూలిపోతాడు.

రోజుకు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగండి, మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు, మజ్జిగ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ప్రాణంతకమైన రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు తొలి 3 - 6 గంటలు అత్యంత కీలకంగా మారుతాయి. ఈ సమయంలో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయని పక్షంలో మనిషి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు సంభవించినప్పటికీ దానిని పట్టించుకోక, అజీర్ణం లేదా కండరాల ఒత్తిడిగా భావించినట్లయితే ఆలస్యం జరిగి చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెపోటు లక్షణాలు సాధారణంగా.. కొన్ని సమయాలలో గుంజుతున్నట్లుగా, ఛాతీ ఒత్తిడి లేదా నొప్పి, తరుచుగా దవడ లేదా ఎడమ బాహువునకు వ్యాపించడం, తరుచుగా చెమటలు పట్టడం లేదా భయాందోళనకు గురౌతున్న భావన తదితరాలను చెప్పవచ్చు.

ఆ టైంలో శృంగారం మీద ఆసక్తి రావడం లేదా, అయితే ఈ టిప్స్ ప్రయత్నించి చూడండి, సెక్స్ మీద భార్యాభర్తలకు ఆసక్తి పెరగడానికి కొన్ని చిట్కాలు

అయితే అనేక మంది రోగులు ఇటువంటి లక్షణాలను అనుభవించకపోవచ్చు. వారి ఈ లక్షణాలు స్వల్పంగా ఉండి, వెనుకవైపు, భుజాలు, ఉదరముల వద్ద విపరీతమైన లక్షణాలు ఉండవచ్చు. వాంతులు లేదా గుండె మండుతున్న భావన కలిగించవచ్చు. సాధారణంగా 30% గుండెపోటులు ఈసీజీ పరీక్షల ద్వారానే నిర్ధారించబడ్డాయి.

వంశానుసారం హృద్రోగం, అధిక కొవ్వును కలిగినవారు, అధికబరువు గలవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ త్రాగేవారు, ఊబకాయం గలవారు, ఎప్పుడూ కూర్చుని పనిచేసేవారికి పై హెచ్చరిక వర్తిస్తుంది. ఎవరైనా గుండెపోటు కలిగి ఉన్నట్లయితే, ప్రతి నిమిషం మీకు అమూల్యమైనది. మీరు వైద్యసిబ్బంది కోసం వేచి ఉన్న సమయంలో, ఆసుపత్రికి వెళుతున్న మార్గంలో ఒక ఆస్ప్రిన్‌ను తీసుకోండి.గుండెపోటు వచ్చాక మొదటి 24 గంటలు అత్యంత కీలకమైనవి. ముందస్తు చర్యగా, ఎంత త్వరగా పరిహృదయ ధమనిని తెరిస్తే అంత త్వరగా రోగి కోలుకుంటాడు.ప్రస్తుత కాలంలో దాదాపుగా అన్ని ఆసుపత్రులు గుండెపోటు చికిత్సకు అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలను సంతరించుకున్నాయి.కాబట్టి గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి. వైద్య సిబ్బందిని పిలవండి లేదా సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళి సకాలంలో చికిత్సను పొందండి.