Almonds

వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది. బాదం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ: బాదాం ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే జింక్, సెలీనియం, విటమిన్ ఈ, విటమిన్ ఏ, వంటి పోషకాలు శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని ఇచ్చి జబ్బుల నుండి దూరం చేస్తుంది. అంతే కాకుండా బాదం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్సు అదే విధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు గురికాకుండా చేస్తుంది. బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు అనేక రకాలైన సమస్యలు పెరుగుతాయి. బాదంపప్పును ప్రతిరోజు తీసుకోవడం ద్వారా వీటిని మనం తగ్గించుకోవడం ఈజీ అవుతుంది. ఇందులో ఉండే పోషకాలు విటమిన్లు ఖనిజ లవణాలు అన్నీ కూడా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫర్మేషన్ కారణంగా శరీరంలో ఏర్పడ్డ వాపులను తగ్గిస్తుంది.

Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.

గుండెకు మంచిది: బాదంపప్పులో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాలను పెంచి గుండె సంబంధ వ్యాధులను రాకుండా చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం: బాదంను ప్రతిరోజు మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా అధికంగా ఉండడం ద్వారా మీకు ఈజీగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బాదంపప్పును తీసుకున్నట్లయితే ఇది కడుపు నిండినట్లుగా అనిపించి ఆకలి తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మకాంతిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆయిల్ కంటెంట్ వల్ల మన చర్మం ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండి నిగారింపును సంతరించుకుంటుంది. ఏడాదిలో కనీసం రెండు నెలలు పాటు బాదాం ని తీసుకుంటే మీరు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.