సాయంత్రం పూట చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే పిజ్జా, బర్గర్, సమోసా వంటివి కాకుండా హెల్ది స్నాక్స్ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన హాని జరుగుతుంది. దీనివల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ పెరగడం, మలబద్ధకం సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుని కొన్ని స్నాక్స్ గురించి తెలుసుకుందాం.
మరమరాలు: మరమరాల్లో క్యాలరీస్ ఉండవు కాబట్టి ఇవి తీసుకున్నట్లయితే మీరు బరువు పెరగరు. కనుక ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే మీ ఆకలి తీరుతుంది హెల్దీగా ఉంటారు.
Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...
మొలకెత్తిన గింజలు: మొలకెత్తిన గింజల్ని కూడా మీరు ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యాలతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి విటమిన్స్ ,మినరల్స్ ఇవన్నీ కూడా అధికంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
ఉడకపెట్టిన శనగలు: శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది జంక్ ఫుడ్ తో పోలిస్తే ఉడకపెట్టిన శనగలను తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కూడా అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. కండరాలకు బలంగా ఉంటుంది దీన్ని కూడా ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు. బాదం ,ఆ క్రోట్ గుమ్మడి గింజలు వంటి వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మీకు మలబద్ధంగా సమస్య నుంచి బయటపడతారు. ఈవినింగ్ స్నాక్స్ గా ఈ డ్రైఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మీకు ఇందులో ఉండేటువంటి పోషకాలు అన్ని కూడా అందుతాయి. కాబట్టి స్నాక్స్ గా ఇవి కూడా తీసుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.