మనం తీసుకునే ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యమైన పదార్ధంగా చెప్పవచ్చు. అయితే దీనిని కొంత మేరకు వినియోగించడం మంచిదే. అయితే అధికంగా దీన్ని వినియోగించడం ద్వారా మన ఆరోగ్యం పైన హానికర ప్రభావాలను చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉప్పును తీసుకుంటారు. అయితే ఎక్కువగా తీసుకున్న వారిలో దీర్ఘకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్ద వయసుల వారు ఎంత ఉప్పు తీసుకోవాలి. అనేది చాలా ముఖ్యం. వయసును బట్టి ఎవరు ఎంత ఉప్పు తీసుకోవాలో మనం తెలుసుకుందాం..
పిల్లలు.. నెలల నుంచి రెండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అసలు ఉప్పు అవసరం ఉండదు. తీసుకునే ఆహార పదార్థాలలో కొంచెం సోడియం ఉంటుంది. మూడు సంవత్సరాలు వయసు దాటిన పిల్లలకు 1 గ్రామ కంటే ఎక్కువగా ఉప్పు తినిపించకూడదు. అలాగే నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు కేవలం రోజు మొత్తంలో 2 గ్రాముల వరకు మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా ఏడు నుంచి ఆ పై వయసు ఉన్న పిల్లల్లో 3 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలి అంతకంటే ఉప్పు తీసుకోవడం వల్ల పిల్లల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .అంతే కాకుండా బిపి, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో సాధ్యమైనంత వరకు తక్కువ ఉప్పును ఇచ్చేలాగా చూసుకుంటే మంచిది..
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
యువత.. 16 సంవత్సరాల నుండి యువత శరీరంలో శారీరక ఎదుగుదలకు కాస్త ఉప్పు అవసరం ఉంటుంది. వారి రోజువారి పనులలో కూడా ఉప్పును తీసుకోవడం వల్ల సమతుల్యంగా ఉంటుంది. అయితే పదహారేళ్లు దాటిన వారు ప్రతి రోజు నాలుగు నుంచి 5గ్రాములు ఉప్పు మాత్రమే తీసుకోవాలి. దీనికంటే ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి..
పెద్దలలో.. 30 ఏళ్లు దాటిన వారిలో ఉప్పు పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. పెద్ద వయసులో ఉన్నవారు అంటే 30 ఏళ్లు దాటిన వారు ప్రతి రోజు కేవలం 5గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. వీరికి ఆరోగ్యపరంగా నాలుగు నుంచి 5గ్రాముల ఉప్పు సరిపోతుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల వీరులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి, షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
వృద్ధులలో- వృద్ధులలో వారి శరీర పనితీరు కాస్త నెమ్మదిస్తుంది. ఈ వయసులో ఉన్నవారికి రక్తపోటు సమస్య కూడా ఉంటుంది. అటువంటివారు ఉప్పు తీసుకోవడం చాలా నియంత్రించాలి. వృద్ధులు కేవలం రోజుకి మూడు గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం ద్వారా మీరు శరీరంలో అదనపు నీరు చేరుతుంది. దీని ద్వారా గుండె జబ్బులు మూత్రపిండాల వంటి సమస్యలు వస్తాయి.
ఉప్పును తగ్గించే మార్గాలు.. మార్కెట్లో లభించే ప్రాసెస్ ఫుడ్స్ కి దూరంగా ఉంటే మంచిది వీటిల్లో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి అనారోగ్యానికి చాలా హాని చేస్తాయి. అలా కాకుండా మీరు తాజా పనులను కూరగాయలు తీసుకోవడం వల్ల ఇందులో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంట్లో తీసుకున్న ఆహార పదార్థాలలో ఉప్పును పెంచుకోకూడదు. కాబట్టి మీరు రోజు వారి ఉప్పు మొత్తాన్ని మీకు కావాల్సినంత మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి