foods

వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఈ సీజన్లో తరచుగా మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు అధికమవుతాయి. మన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు అనేక రకాల వ్యాధుల బారిన పడతాము. అలా కాకుండా కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులతో పోరాడి రక్షిస్తాయి. ఆ ఆరో సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి: తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా మనం ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మనకు జలుబు, జ్వరం, దగ్గు సమస్యల నుంచి బయటపడతాం.

పసుపు: పసుపు మనం యాంటీ బ్యాక్టీరియల్  చెప్తాము. ఈ పసుపును మనం ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో సంభవించే అన్న అనేక రకాలైన వైరల్ ఫీవర్లు బ్యాక్టీరియల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడి మనకు రోగనిరోధక శక్తిని పెంచి ఆ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

వెల్లుల్లి:   యాంటీ మైక్రోబియన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచే ఒక శక్తివంతమైన బూస్టర్. ఇది మన శరీరంలో ఏర్పడ్డ టాక్సిన్స్ బయటకు పంపించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడానికి కూడా ఈ వెల్లుల్లి అనేది బాగా సహకరిస్తుంది. దీనిలో ఉన్న ఆంటీ ఫంగల్ ఆంటీ మైక్రోబియన్ లక్షణాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు సమస్యల నుంచి బయటపడతాం.

సిట్రస్ ఫ్రూట్స్: సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ వర్షాకాలంలో మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబు లక్షణాల నుంచి బయటపడేలా చేసి మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది.

Health Tips: బాదంపప్పు కలిపిన పాలు తాగితే ఎముకలు ఉక్కులా మారుతాయి ...

పెరుగు: పెరుగులో ప్రోబయాటిక్లు అధికంగా ఉండడం వల్ల మన జీర్ణ క్రియ కు సహకరిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. పెరుగుని మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే అది మన శరీరంలో ఉన్న వ్యక్తాలను బయటికి పంపించి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన ఇమ్యూనిటీని పెంచడంలో కూడా సహకరిస్తుంది.

తేనె:  తేనెలో యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ  ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన గొంతు నొప్పి తగ్గించడానికి అదే విధంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తేనెను ప్రతిరోజు మనము ఒక స్పూన్ తీసుకున్నట్లయితే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి వైల్డ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.

తృణధాన్యాలు:  బార్లీ, ఓట్స్ ,వంటివి మన జీర్ణ క్రియను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువును కూడా తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ పెరిగి అనేక రకాలైన జబ్బుల నుండి మనల్ని కాపాడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.