Dengue (photo-Pixabay)

డెంగ్యూ జ్వరం వర్షాకాలం మొదలైన తర్వాత దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీన్ని నియంత్రించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ డెంగ్యూ జ్వరం వల్ల చాలా ప్రమాదానికి గురవుతారు.పిల్లల్లో రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు జ్వరంతోపాటు ఇంకొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ కొన్ని పద్ధతుల ద్వారా డెంగ్యూ జ్వరం రాకుండా కాపాడవచ్చు.

డెంగ్యూ జ్వరం లక్షణాలు: అధిక జ్వరము, తలనొప్పి, వాంతులు, అలసట, చర్మం పైన దద్దుర్లు, కళ్లనొప్పి, ఇవన్నీ కూడా డెంగ్యూ జ్వరం లక్షణాలు. మీ పిల్లల్లో కనక ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి .

ఇంటిని శుభ్రంగా ఉంచండి: ఇంటి మూలాల్లో చెత్తాచెదారము, నీటితో నిండినటువంటి ఏవి కూడా ఉండనివ్వదు. నీటితో ఉన్న వాటిని నిల్వ చేయడం మానుకోండి. దీని ద్వారా దోమల యొక్క నివారణ ఈజీగా చేయవచ్చు.

ఆహారం: మీ ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను చేర్చుకోండి. బలమైన రోగనిరోధక శక్తి ఆహారం తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరంతో పోరాడే శక్తి వస్తుంది. మీ పిల్లల ఆహారంలో ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్, పసుపు పాలు, అల్లం ,దానిమ్మ పండు బాదం గింజలు ,ఇవన్నీ తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి అనేది పెరిగి జ్వరం తొందరగా మానడానికి సహాయపడుతుంది.

Health Tips: బరువు తగ్గడానికి టీ మానేయాలా..? పూర్తి వివరాలు మీ కోసం..

పిల్లలకు ఎప్పుడు కూడా బట్టలు పూర్తిగా కప్పి ఉంచే విధంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు దోమల కుట్టకుండా పిల్లలు బట్టలు ధరించేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టవు. దీని ద్వారా కూడా డెంగ్యూ జ్వరాన్ని అరికట్టవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.