మలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.
లక్షణాలు. మలేరియా జ్వరం వచ్చినప్పుడు ప్రధాన లక్షణం హై టెంపరేచర్. అధిక జ్వరంతో పాటు చలి కూడా కలిసి వస్తాయి. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. నీరసంగా అలసిపోయినట్లుగా బలహీనంగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా చమట పట్టడం, గుండెదడగా అనిపించడం అదేవిధంగా కండరాల నొప్పులు ,కీళ్ల నొప్పులు కూడా ఉంటాయి. వాంతులు ,వికారంగా కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు కడుపునొప్పి కూడా వస్తుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు సంఖ్య తగ్గిపోయి మోహము పాలిపోయినట్లుగా ఉంటుంది. సాధారణంగా మలేరియా 10 నుంచి 15 రోజులు తర్వాతనే లక్షణాలు కనిపిస్తాయి.
Health Tips: కడుపుబ్బరం, అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా.
నివారణ. రాకుండా ఉండడానికి దోమల నుండి రక్షణ తీసుకోవాలి. నిండుగా ఉండే బట్టలను ధరించడం ద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి. అదే విధంగా కాళ్లకు సాక్స్ ధరించాలి. దోమతెరలను వాడాలి. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిద్రిస్తున్నప్పుడు దోమతెరలను ఉపయోగిస్తే దీని నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా సాయంత్రం కాగానే కిటికీలు తలుపులు అన్నిటిని కూడా మూసివేసి ఉంచాలి. అంతేకాకుండా యూక్లిప్టస్ ఆయిల్ ను కొన్ని రకాలైనటువంటి ఆంటీ మస్కిటో జెల్ ను శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి..
అంతేకాకుండా దోమల్ని చంపడానికి స్ప్రేస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మలేరియా ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు లేదా నివసించేటప్పుడు మందులను ముందే తీసుకున్నట్లయితే దాని నుంచి బయటపడవచ్చు.
ఎక్కువగా నీరు నిలిచి ఉన్న ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు నీరు నిలవ లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి శరీరానికి తగినంత నీరు అందించాలి. ఇలా చేయడం ద్వారా ఇమ్యూనిటీ అనేది పెరిగి ఈ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.