Cervical-Cancer.

ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు. పని ఇల్లు పిల్లల బాధ్యతలతో బిజీ లైఫ్ తో ఆరోగ్యం కోసం సమయానికి కేటాయించలేక పోతారు. అటువంటివారు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఇవి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. అలా కాకుండా మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆ వైద్య పరీక్షలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాప్ స్పర్మ్ పరీక్ష- గర్భశయ్య క్యాన్సర్ గుర్తించేందుకు ఈ పరీక్షలు చేస్తారు. 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. దీని ద్వారా మన గర్భాశయంలో ఏమైనా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో సకాలంలోనే మనం గుర్తిస్తాము..

రొమ్ము క్యాన్సర్ పరీక్ష- మహిళల్లో సాధారణంగా రొమ్ము క్యాన్సర్ దీనికి స్క్రీనింగ్ చాలా ముఖ్యం. మీ రొమ్ములో ఏమైనా గడ్డలు లేదా మార్పులకు గుర్తించినప్పుడు వెంటనే మీరు రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన నుండి ప్రతి సంవత్సరం కూడా మామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ను మనం ముందుగానే గుర్తించవచ్చు.

Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా.

థైరాయిడ్- థైరాయిడ్ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరీక్షను మీరు ప్రతి సంవత్సరం ఒకసారి చేయించుకున్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి దీనికి తగిన చికిత్స చేసుకోవడం ద్వారా దీని నుండి బయటపడవచ్చు.

షుగర్ టెస్ట్- మహిళల్లో 40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి సంవత్సరం కూడా షుగర్ టెస్ట్ ను చేయించుకోవాలి గ్లూకోస్ స్థాయిని నియంత్రించుకోవడానికి ఈ పరీక్షను చేయించుకోవాలి. దీని ద్వారా గుండె జబ్బులు మూత్రపిండాల సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి.

రక్తపోటు - 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ప్రతి సంవత్సరం రక్తపోటు పరీక్షను చేయించుకోవాలి. దీని ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బుల నుండి బయటపడవచ్చు. కేవలం గుండె జబ్బులు మాత్రమే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ వ్యాధులకు నుండి బయటపడవచ్చు. కాబట్టి ప్రతి మహిళ కూడా క్రమం తప్పకుండా ఈ నాలుగు టెస్టులను ప్రతి సంవత్సరం చేయించుకోవడం ద్వారా మీరు అనేక రకాలు అయినటువంటి ప్రాణాంతక వ్యాధుల నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.