Nipah Virus (Photo-PTI)

Kozhikode, Sep 13: కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభిస్తోంది. కోజిక్కోడ్‌లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు (Nipah virus alert in Kerala) వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు (Kerala Nipah deaths) మరణించారు. నిపా వైరస కేసులు మళ్లీ రాష్ట్రంలో విజృంభిస్తుండడంతో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి అసెంబ్లీలో మాట్లాడుతూ పుణెకు చెందిన ఎన్‌ఐవి అధికారులు, చెన్నైకు చెందిన అంటువ్యాధుల నిపుణుల బృందం కోజిక్కోడ్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకూ 130 మందికి నిపా వైరస్ నిర్దారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించింది. వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కన్నూర్, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్ ప్రకటించింది. జిల్లాలోని ఏడు పంచాయతీల్లో కంటెయిన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటుచేసింది. పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించిన అధికారులు.. నిత్యావసర వస్తువుల దుకాణాలకు మాత్రమే అనుమతించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు వెళ్లడానికి అనుమతిలేదని కోజికోడ్ కలెక్టర్ ఏ గీత స్పష్టం చేశారు.

కేరళలో నిపా వైరస్ కల్లోలం, 42 ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు, పలు ఆంక్షలు అమల్లోకి..

కంటెయిన్‌మెంట్ జోన్‌లలోని ప్రజలు తప్పనిసరగా మాస్క్‌లు ధరించి.. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం అటు, నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల బృందం కేరళకు బయలుదేరింది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి నిర్దారణ పరీక్షలతో పాటు గబ్బిలాలపై సర్వే నిర్వహించనుంది.

కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆగస్టు 30వ తేదీన ఒకరు, ఈ నెల మొదట్లో మరొకరు నిపా వైరస్‌తో చనిపోయినట్లు అధికారులు చెప్పారు.వారి బంధువుల్లో ఇద్దరికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.2018 నుంచి ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడటం ఇది నాలుగోసారి. 2018లో కోళికోడ్ జిల్లాలో 18 నిఫా వైరస్ కేసులు వెలుగుచూస్తే అందులో 17 మరణాలు సంభవించాయి.2019లో ఎర్నాకులం జిల్లాలో ఒక నిఫా వైరస్ కేసు నమోదైంది. అయితే బాధితుడు కోలుకున్నాడు. 2021లో చాతమంగలం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు వైరస్ బారినపడి మరణించాడు.

మళ్లీ డేంజర్ బెల్స్, కరోనా తీవ్రతను పెంచే 28 కొత్త ప్రమాద కారకాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

కేరళలో పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని కేరళకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. వైరస్‌ను కట్టడి చేయడంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేస్తామని అన్నారు.కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ చనిపోయిన ఇద్దరితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంటాక్ట్ అయిన 168 మంది వ్యక్తులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేరళలో మరోకొత్త వైరస్‌తో ఇద్దరు మృతి, చికిత్స పొందుతున్న మరో నలుగురు, వందల సంఖ్యలో అనుమానితుల గుర్తింపు, కేంద్రం నుంచి కేరళకు ప్రత్యేక బృందం

రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాపించిన కోజికొడ్ జిల్లాలో పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో అనుసరించే ప్రోటోకాల్స్ పై సూచనలు చేసినట్లు తెలిపారు.వైరస్ మూలంగా చోటుచేసుకున్న మరణాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఆసుపత్రులకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పటికే చనిపోయిన వారితో సంబంధం ఉన్న వారందరినీ గుర్తించి, అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

నిపా వైరస్ సంకేతాలు,

నిపా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉన్నాయి. ఈ లక్షణాలతో పాటు మైకం, మగత, నాడీ సంబంధిత సంకేతాలు, 24-48 గంటల్లో కోమాకు దారితీయవచ్చు.నిపా వైరస్ వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది. అలాగే, నిపా ఇన్ఫెక్షన్ అనేది ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు). ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, నిఫా వైరస్ సంక్రమణ వల్ల అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛలు, కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీస్తుంది.

నిపా వైరస్ అంటే ఏమిటి?

నిపా అనేది మనుషులు, జంతువుల మధ్య వ్యాపించే ఇన్ఫెక్షన్..దీనిని వైద్యులు జూనోటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఇది కొన్ని జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా వెన్నెముక, అస్థిపంజరాలు కలిగిన జంతువుల నుంచి సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మొదట బెంగాల్‌లోని సిలిగురిలో 2001 వ్యాపించిందని ఆ తర్వాత మళ్లీ 2007లో విస్తరించడం పెరిగిందని వైద్య నివేదికల్లో పేర్కొన్నారు.

నిపా వైరస్ లక్షణాలు:

ఈ వ్యాధితో బాధపడేవారు మొదట్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, కళ్లు తిరగడం, నీరసం తదితర లక్షణాలు కనపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత గొంతు నొప్పితో పాటు మైకము, మెదడువాపుతో బాధపడతారు. ఈ వ్యాధుల తీవ్ర తరమైన తర్వాత న్యుమోనియా, తీవ్రమైన శ్వాస సమస్యలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల తరహాలోనే ముక్కు, గొంతు నుంచి శాంపిల్స్ తీయడంతోపాటు మూత్ర, రక్త నమూనాల ద్వారా కూడా నిపా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

నిపా వైరస్ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అంతేగాక కల్తీ ఆహారంతోపాటు స్పర్శ వారా కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. పందులు, మేకలు, గుర్రాలు, కుక్కలు, పిల్లుల ద్వారా ఈ వైరస్ సోకుతుంది. వైరస్ సోకిన జంతువును తినడం వల్ల కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.నిపా వైరస్ సోకిన పందులు లేదా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మందిలో ఈ వైరస్‌..మూత్రం లేదా మలం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. పండ్లపై ఇతర కీటకాలు వాలడం ద్వారా కూడా ఇలాంటి వైరస్‌ వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఉష్ణమండల రాష్ట్రమైన కేరళలో పట్టణీకరణతోపాటు ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడం వంటి పరిస్థితులు నిఫా వైరస్ లాంటి వైరస్‌లు వ్యాపించడానికి అనువుగా మారాయని తెలిపింది.

అటవీ ప్రాంతం తగ్గిపోవడం వలన జంతువులు ఆవాసాలను కోల్పోయి మానవులకు మరింత దగ్గరగా జీవిస్తున్నాయని, ఇందువల్ల వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, నిపా వైరస్ అనేది జూనోటిక్ అనారోగ్యం. అంటే, జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. నిపా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మానవులకు వ్యాప్తిస్తుందరి డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

కలుషిత ఆహారం, ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి ద్వారా కూడా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది.కొన్ని సందర్భాలలో వైరస్ సోకిన వారిలో వైరస్ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో మాత్రం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఈ వైరస్‌కు సరైన చికిత్స, వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం వలన వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వైరస్ లక్షణాలను గుర్తించి, వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

నివారణ చర్యలు:

నిపా రాకుండా మీ శరీరాన్ని రక్షించుకోవడానికి తప్పకుండా జంతువుల స్థాలల నుంచి దూరంగా వెళ్లడం చాలా మంచిది.

వ్యాధి సోకిన జంతువులను చంపి, మృతదేహాలను కాల్చడం మంచిది.

వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు ఉంటున్న ప్రదేశాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాధి సోకిన వారు పచ్చి ఖర్జూరాల రసాన్ని తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు.

నిపా వైరస్‌కు నిర్దిష్టమైన వైద్య చికిత్స ఏదీ లేనప్పటికీ వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స జరుగుతుంది. అయితే ఈ వైరస్ సోకిన రోగులలో మరణాల రేటు 40 నుంచి 75 శాతం ఉండడం ఆందోళన కలిగించే అంశం.