ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ (Reused Cooking Oil) ఉపయోగిస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలామంమదికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు అందిరికీ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా వాడిన వంటనూనెతో (Reheating Cooking Oil) తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు సోకుతాయని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పరగడపున టీ, కాఫీ బదులుగా, వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, రోజంతా జింక పిల్లలా శక్తితో ఉంటారు...
కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్‌ఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుంది .వీరు లీటర్ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తారు. అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు వాడిన వంటనూనె విక్రయాల కోసం సదరు సంస్థను సంప్రదించాలని ఆహార భద్రత శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ నూనె సాయంతో బయోడీజిల్ తయారు చేస్తారు. ఫలితంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.