Char Dham Yatra 2023 (Photo-PTI)

Kedarnath Yamunotri Temples Close: హిమాలయాల సానువుల్లో కొలువై ఉన్న కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసేశారు. విపరీతమైన చలిలో కూడా కేదార్‌నాథ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.

ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్‌నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్‌నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారని అధికారులు తెలిపారు.

అయోధ్య సరయూ నదిలో మొసలి కలకలం, భయభ్రాంతులకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..

ఛార్‌దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్‌లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్‌ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్‌దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్‌లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు.