Tirumala, Apr 15: స్కూల్ (School), కాలేజీ విద్యార్థులకు (College Students) వేసవి సెలవులు (Summer Holidays) కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ (Devotees Rush) భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. మరో రెండు వారాలు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వదర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నది. క్యూలైన్ లో వేచియున్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ అందిస్తున్నది. శ్రీవారి మెట్లమార్గంలో రోజుకు ఇచ్చే 5 వేల టోకెన్స్ అయిపోవడంతో భక్తులకు నిరీక్షణ తప్పట్లేదు.
TTD Update : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Huge Rush of devotees in Tirumala Temple | hmtv#hmtvnews #hmtv pic.twitter.com/xO3nhhq4mr
— hmtv News (@hmtvnewslive) April 13, 2024
ప్రత్యేక దర్శనానికి 5 గంటలు
టైమ్ స్లాట్, కాలినడక వచ్చే దివ్యదర్శనం భక్తులకు సుమారు 7 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతున్నది. శనివారం తిరుమల శ్రీవారిని 82,139 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.3.97 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.