File (Credits: Google)

Shirdi, Nov 11: షిర్డీ సాయి భక్తులకు (Shirdi Sai Devotees) ఇది గొప్ప శుభవార్త (Great News). ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సమాధిని (Sai Samadhi) స్పృశించే భాగ్యం కూడా కలగనుంది. ఇప్పటి వరకు వీఐపీ (VIP) భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం ఉండేది. ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఆ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తె.. ఎవరూ పెళ్ళికి ముందుకు రాకపోవడంతో తండ్రి సంచలన నిర్ణయం.. శ్రీకృష్ణ భగవానుడికి కుమార్తెను ఇచ్చి వివాహం.. హాజరైన బంధుమిత్రులు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

నిజానికి ఒకప్పుడు సాయి సమాధిని తాకే అవకాశం అందరికీ ఉండేది. అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ తర్వాత భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు. దీంతో అప్పటి నుంచి సాయి సమాధిని స్పృశించే అవకాశం సాధారణ భక్తులకు లేకుండా పోయింది. తాజాగా, మరోమారు ఆ అవకాశాన్ని తీసుకురావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.