Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి
వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 18, 2023 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

