Washing raw chicken (Photo: fb Screen grab)

Melborne, JAN 08: చికెన్ వండే ముందు మీరంతా ట్యాప్ కింద పెట్టి కడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరుకొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో పడటం ఖాయం. వండటానికి ముందు చికెన్‌ను (Chicken) ట్యాప్‌ కింద పెట్టి కడగడం వల్ల ఆ తుంపర్లు వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపైలోబాక్టర్‌ (Campylobacter), సాల్మొనెల్లా (Salmonella) అనే బాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయి కాబట్టి ఇలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నా చాలా మంది మానుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా ఫుడ్‌ సేఫ్టీ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ (Australia's Food Safety Information Council) జరిపిన సర్వేలో ఇది మరోసారి రుజువైంది. ఇక్కడి జనాభాలో సగం మందికి పైగా చికెన్‌ను నల్లా కింద కడుగుతున్నారు. దీనివల్ల గడిచిన 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపైలోబాక్టర్‌, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌లు రెట్టింపు అయినట్లు తెలిపారు.

Beauty Tips: అమ్మాయిలు మొహం నల్లగా మారిందని బాధపడుతున్నారా, అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మొహాన్ని తెల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా మీకోసం.. 

అత్యాధునిక మార్గాల్లో మాంసం ఉత్పత్తి చేస్తున్న ఈ రోజుల్లో చికెన్‌ను కడగాల్సిన అవసరం లేదని, ఒక వేళ పాత అలవాటును మానుకోలేకపోతే పట్టి ఉంచిన నీటిలో ముంచి కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనంతరం శుభ్రమైన పొడి వస్త్రంతో మాంసాన్ని బాగా తుడిచి, దానిని సురక్షిత ప్రదేశంలో ఉంచాలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది వెనిగర్‌, నిమ్మ రసాలతో చికెన్‌ను శుభ్రం చేస్తారని, దీని వల్ల కూడా ఉపయోగం లేదని తెలిపారు. ఈ విధానంలోనూ బాక్టీరియా (bacteria) వ్యాప్తి చెందుతుందని వివరించారు.