HONOR X9b Smartphone: HTech కంపెనీ తమ బ్రాండ్ నుంచి X సిరీస్‌లో సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Honor X9b ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-బౌన్స్ 360° యాంటీ-డ్రాప్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది, ఇందులో అత్యాధునిక కుషనింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా వినూత్న షాక్-అబ్జార్బింగ్ నిర్మాణంతో వస్తుంది. తద్వారా ఈ ఫోన్ ఎలాంటి కఠిన ఉపరితలాలపై కిందపడినప్పటికీ నష్టం వాటిళ్లదు, దీనికి అన్ని కోణాల నుంచి 360 డిగ్రీల రక్షణ ఉంటుందని. మెరుగైన నీటి నిరోధకతను కూడా కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఇక ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. హై-ఎండ్ వాచ్‌ల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌తో సొగసైన బాడీని కలిగి ఉంది. దీని కెమెరా మాడ్యూల్ ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. శాకాహారి లెదర్ యాక్సెంట్‌ల వంటి పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్ ఎలిమెంట్‌లను కూడా కలిగి ఉంది.
Honor X9b సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్ ఏకైక వేరియంట్లో లభిస్తుంది. హార్డ్‌వేర్ పరంగా ఈ హానర్ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Honor X9b స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 1200x2652 పిక్సెల్ రిజల్యూషన్
- 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 108MP+ 5MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ధర: రూ. 25,999/-
5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ax (2.4GHz/5GHz), బ్లూటూత్ 5.1, GPS, NFC, USB టైప్-సి ఆడియో, బాటమ్-పోర్టెడ్ స్పీకర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ఫిబ్రవరి 16 నుండి అమెజాన్, హానర్ అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. పరిచయ ఆఫర్‌గా రూ. 699 విలువైన కాంప్లిమెంటరీ ఛార్జర్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తోంది.