Infinix Hot 40i Smartphone: హాంగ్ కాంగ్‌కు చెందిన మొబైల్ తయారీదారు ఇన్ఫినిక్స్ గతేడాది HOT 30i అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు దానికి సక్సెసర్‌గా హాట్ సిరీస్‌లో Hot 40iని భారత మార్కెట్లో విడుదల చేసింది. 'ఇన్ఫినిక్స్ హాట్ 40i' అనేది సరసమైన ధరలో లభించే ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. అయినప్పటికీ ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో, మంచి హార్డ్‌వేర్‌ను కలిగి, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.
Infinix Hot 40i స్టార్‌లిట్ బ్లాక్, పామ్ బ్లూ, హారిజోన్ గోల్డ్, స్టార్‌ఫాల్ గ్రీన్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతుంది. లుమినస్ కలర్-షిఫ్ట్ టెక్నాలజీతో స్కైఫాల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో హై-రిజల్యూషన్ సెల్ఫీలు, వీడియో కాల్‌లను సంగ్రహించడానికి 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. అదనంగా డైనమిక్ ఐలాండ్ లాంటి మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS 200% సూపర్ వాల్యూమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆప్టిమైజ్ చేసిన గేమింగ్ పనితీరు కోసం XBOOST గేమింగ్ ఇంజిన్ వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది. హార్డ్ వేర్ పరంగా 16GB (8GB +8GB వర్చువల్ RAM) మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
కొత్త Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ AI డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్
- ధర రూ. 9,999/-
కనెక్టివిటీ కోసం డ్యూయల్ 4G, నానో SIM, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, GLONASS మరియు USB టైప్-C కనెక్టివిటీ అందిస్తున్నారు. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 21 నుండి Flipkartలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. వివిధ బ్యాంకింగ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.