Infinix Smart 8 Smartphone: మొబైల్- కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు ఇన్ఫినిక్స్ కంపెనీ గత నెలలో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్8' పేరుతో ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌కు మరొక కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ర్యామ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర పాత దానితో పోలిస్తే కేవలం రూ. 500 మాత్రమే ఎక్కువ.
ఇది సరసమైన ధరలో లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ ఇందులో 50MP ప్రధాన కెమెరా, HD+ డిస్‌ప్లే వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ మీకు టింబర్ బ్లాక్, షిన్నీ గోల్డ్, గెలాక్సీ వైట్ మరియు రెయిన్‌బో బ్లూ కలర్ వంటి నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో G26 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ AI డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం
- ధర రూ. 7,999/-
కనెక్టివిటీ కోసం డ్యూయల్ 4G, నానో SIM, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, GLONASS మరియు USB టైప్-C కనెక్టివిటీ అందిస్తున్నారు. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 8 నుండి Flipkartలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లపై కంపెనీ 10% తగ్గింపును కూడా అందిస్తోంది.