Mumbai October,30: జియో, గూగుల్ సంయుక్తంగా తీసుకువస్తున్న జియోఫోన్ విడుదలైంది. జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.6,499గా ప్రకటించారు. జియోఫోన్ నెక్స్ట్ దీపావళి నుంచి సేల్‌లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను జియో వెల్లడించింది జియో. ముందుగా రూ.1,999 చెల్లించి వినియోగదారులు ఈ ఫోన్‌ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల వ్యవధిలో ఈఎంఐలో చెల్లించవచ్చు. ఇందుకోసం జియో నాలుగు వాయిదా పద్ధతులను ప్రకటించింది. ఇందులో రీఛార్జి ప్లాన్లు కలిపి ఉంటాయి.
మొదటిది అల్వేస్-ఆన్ ప్లాన్ (Always-on Plan). ఇందులో 18 నెలల కాలవ్యవధికి నెలకు రూ. 350 లేదా 24 నెలల కాలానికి నెలకు రూ.300 చొప్పున చెల్లించొచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు నెలకు 5జీబీ డేటాతోపాటు 100 నిమిషాల టాక్‌టైమ్ పొందుతారు.
ఇక రెండోది లార్జ్ ప్లాన్ (Large Plan). ఈ ప్లాన్ కింద కస్టమర్స్ 18 నెలల వ్యవధిలో నెలకు రూ. 500 లేదా 24 నెలలకు నెలకు రూ.450 చొప్పున చెల్లించొచ్చు. ఇందుకు రోజుకు 1.5జీబీ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్‌ను పొందుతారు.
మూడోది ఎక్స్ ఎల్ ప్లాన్ (XL Plan). ఇందులో 18 నెలల కాలానికి నెలకు రూ.550 లేదా నెలకు రూ.500 చొప్పున 24 నెలలపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజూవారీ 2జీబీ హై-స్పీడ్ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు.
నాలుగోది డబుల్ ఎక్స్‌ఎల్ ప్లాన్ (XXL Plan). ఈ ప్లాన్ కింద ఫోన్ కొనుగోలు చేసిన యూజర్స్ 18 నెలల కాలానికి నెలకు రూ. 600 లేదా 24 నెలల కాల వ్యవధికి నెలకు రూ.550 చొప్పున చెల్లించొచ్చు. ఇందుకు యూజర్స్ ప్రతిరోజూ 2.5 జీబీ 4జీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు.
#WATCH | Reliance's JioPhone Next jointly designed by Jio & Google.
JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN
— ANI (@ANI) October 30, 2021
కొద్దిరోజుల క్రితం జియోఫోన్ నెక్స్ట్ కు సంబంధించి ఫీచర్లు కూడా సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ ప్రగతి అనే ఓఎస్‌ను డెవలప్ చేసింది. అలాగే ఈ ఫోన్‌లో జియో, గూగుల్ యాప్‌లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 2జీబీ ర్యామ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌కు వెనుక 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరాలు ఇస్తున్నారు. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్ట్స్, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇస్తున్నారు.