Moto G8 Plus Launched: మోటో జీ8 ప్లస్ ఇండియాలో విడుదల, అక్టోబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు, ప్రత్యేక ఆకర్షణగా అడ్రినో 610 GPU గ్రాఫిక్స్, ధర రూ. 13,999
moto-g8-plus-launched-india-triple-rear-camera-check-price-here (Photo-Twitter)

Mumbai, October 29: చైనా దిగ్గజం లెనోవో కంపెనీకి చెందిన మోటోరోలా బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో విడుదల అయింది. మోటో జీ8 ప్లస్ (Moto G8 Plus) పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మిడ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఇతర ఫోన్లతో పోటీ పడనుంది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.13వేల 999గా నిర్ణయించింది. మోటో జీ8 ప్లస్ ఫోన్.. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ మొత్తం రెండు కలర్లలో లభ్యం అవుతోంది.

స్పెషిఫికేషన్లు

6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080x2340 ఫిక్సల్స్, క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoCతో , 4జిబి ర్యామ్ సపోర్ట్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, అడ్రినో 610జీపీయూ (గ్రాఫిక్స్), మైక్రో ఎస్‌డి కార్డు స్లాట్, 4,000mAh బ్యాటరీ, 15W టర్బో పవర్ 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ యూనిట్ 16ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 5ఎంపీ లెన్స్ డెప్త్ సెన్సార్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్), వైఫై, బ్లూటూత్ v5.0, GPS, NFC, FM రేడియో, 3.5mm ఆడియో సాకెట్, USB Type-C port, ఆండ్రాయిడ్ పై వెర్షన్ 9.0

6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే, (అస్పెక్ట్ రేషియో 19;9). ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080x2340 ఫిక్సల్స్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. LED ఫ్లాష్ కెమెరాలకు మరింత ఎఫెక్టీవ్ గా కనిపిస్తోంది. ఫోన్లో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి.