Motorola Moto G04 5G smartphone | Photo: X

Moto G04 Smartphone: మొబైల్ తయారీదారు మోటొరొలా మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌తో దాని పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా Moto G04 పేరుతో మరొక బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యాక్రిలిక్ గ్లాస్ ఫినిషింగ్ డిజైన్‌తో నీటి-వికర్షక బాడీ ప్యానెల్ ను కలిగి ఉంది. స్క్రాచ్-రెసిస్టెంట్ చేసే మ్యాట్ ఆకృతితో వస్తుంది.

ఇంకా ఈ ఫోన్ హెల్త్ కనెక్ట్ ఫీచర్‌తో వస్తుంది, ఇది వివిధ ఫిట్‌నెస్ యాప్‌ల నుండి మొత్తం డేటాను సేకరించి ఒకే చోట కనెక్ట్ చేయడానికి, సమకాలీకరించడానికి మార్గంగా పనిచేస్తుంది. మరొక ఫీచర్ ఏమిటంటే, ఇన్‌కమింగ్ కాల్స్, ఫ్లాష్ నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు ఫ్లాష్ , స్క్రీన్ లైట్‌ను ఆన్ చేయడం ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు దీని సొంతం. రూ. 7 వేల సరసమైన ధరలోనే లభిస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

Moto G04 కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదేవిధంగా మెమొరీ పరంగా రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా హ్యాండ్ సెట్ స్టోరేజ్‌ని 1TBకి వరకు విస్తరించవచ్చు, ఈ ఫోన్ ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను కూడా కలిగి ఉండటం మరో విశేషం. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద అందివ్వబడ్డాయి.

Moto G04 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
  • 4GB/8GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • యూనిసోక్ T606 ప్రాసెసర్
  • వెనకవైపు 16MP+ AI క్వాడ్ పిక్సెల్ డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

కనెక్టివిటీ కోసం, డ్యూయల్ సిమ్ స్లాట్‌లు, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో కూడిన సింగిల్ స్పీకర్, 3.5mm ఆడియో జాక్ మరియు సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ధరలు: 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 6,999/-

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 7,999/-

ఈ స్మార్ట్‌ఫోన్ Flipkart, Motorola.in సహా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.