OnePlus Nord CE 3 Lite: మీరు రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో మంచి ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా అమెజాన్ లో అందిస్తున్న ఈ అద్బుతమైన డిస్కౌంట్ డీల్‌ని పరిశీలించాలి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వన్‌ప్లస్' ఇప్పుడు తమ బ్రాండ్‌లోని పాపులర్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో ఒకదాని ధరను తగ్గించినట్లు అధికారికంగా ప్రకటించింది. OnePlus Nord CE 3 Lite అనే 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2000 ఫ్లాట్ తగ్గింపును ప్రకటించింది.
గతంలో అమెజాన్‌లో రూ. 19,999 గా ఉన్న ఈ ఫోన్ ధర ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత రూ. 17,999కి విక్రయించబడుతోంది.
OnePlus Nord CE 3 Lite పాస్టెల్ లైమ్ మరియు క్రోమాటిక్ గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభ్యం అవుతుంది. అలాగే ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో, ఆ వివరాలను మరోసారి ఈ కింద పరిశీలించండి.
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.73 అంగుళాల LCD ఫుల్ HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- వెనకవైపు 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13.1 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జర్
మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం లేదా వివిధ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,350 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది, వాటితో కొనుగోలు చేస్తే కేవలం రూ. 16,950/- కే ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని స్మార్ట్‌ఫోన్ మేకర్ స్పష్టం చేసింది.