ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమి నుంచి వేరుపడిన తర్వాత పోకో ఇండియా తన మొట్టమొదటి పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని ఆకర్శణీయమైన ఫీచర్లతో పాటు డిజైన్, బిల్డ్ క్వాలిటీ మరియు కెమెరాలపై ప్రధాన దృష్టి పెట్టింది. పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లలో రియల్ మి ఎక్స్2 తో పోటీ పడుతూ, ఆ ఫోన్ కంటే తక్కువ ధరలకే ఫోన్లను అందజేస్తుంది. పోకో ఎక్స్2 సిరీస్ ఫోన్లు రూ.15,999/- నుండి మొదలవుతున్నాయి. స్టోరేజ్ మరియు ర్యామ్ వేరియంట్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
ఇక పోకో ఎక్స్2 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫీచర్ రూ.20 వేలకు పైబడి ధరలుండే స్మార్ట్‌ఫోన్‌లలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ప్రధానమైన 64-మెగాపిక్సెల్ సోనీ IMX 686 సెన్సార్ కెమెరాలో RAW ఇమేజ్ క్యాప్చర్, 960 FPS స్లో-మో క్యాప్చర్ & VLOG మోడ్ అనే మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింటి.
Poco X2 smartphone ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్
6.67-ఇంచుల ఫుల్ HD, 1080x2340 పిక్సెల్స్ రెసల్యూషన్ డిస్‌ప్లే
64 + 8+2+2 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 20+2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్
4500 mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.
ర్యామ్ 6/8 జీబీ, స్టోరేజ్ 64/128/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు
'అండ్రాయిడ్ 10' ఆపరేటింగ్ సిస్టమ్.
Watch Video:
ఇక ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే ఇండియాలో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ పోకో ఎక్స్2 ధర రూ. 15.999/-, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999/- , 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19.999/- రూ. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుదారులకు ప్రారంభ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు. పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 11, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.