POCO X6 5G Smartphone: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గత నెలలో POCO X6 5G పేరుతో ఒక మధ్య శ్రేణి మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా దీనికి మరొక కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ఈ ఫోన్ 12GB+256GB వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఉన్న వేరియంట్‌ల మాదిరిగానే, POCO X6 5G లో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా మిర్రర్ బ్లాక్ మరియు స్నోస్టార్మ్ వైట్ అనే రెండు రంగులలో గ్లాస్ లాంటి ముగింపుతో అందించబడుతుంది.
ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లకు పోకో ఫోన్లు ప్రసిద్ధి, పైగా వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. తాజాగా విడుదలైన కొత్త ఫోన్ కూడా రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
కొత్త POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
POCO X6 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే
- 12GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్
- వెనకవైపు 64MP+8MP+2MP కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5100 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జింగ్
- ధర రూ. 23,999/-
అదనంగా POCO X6లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ అట్మాస్- స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ మరియు IP54 రేటింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
ఈ కొత్త వేరియంట్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ICICI క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు లేదా EMI చెల్లింపులు చేసే వారికి రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది.