Realme 12 Pro+ 5G Smartphone: చైనీస్ మొబైల్ మేకర్ రియల్‌మి చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న తమ Realme 12 Pro+ 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఒక నెక్స్ట్-జెన్ ఇమేజరీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ అభివర్ణిస్తుంది. ఈ సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే.. దీని డిజైన్, అందమైన కెమెరా అలాగే ఇందులో ఉపయోగించిన ప్రాసెసర్.
ఈ హ్యాండ్ సెట్ ద్వారా పెరిస్కోప్ టెలిఫోటో టెక్నాలజీని పరిచయం కంపెనీ చేసింది, ఈ ఫోన్ లోని Sony IMX ట్రిపుల్ కెమెరా సెటప్ పూర్తిస్థాయి జూమింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ ఫేసింగ్ 32MP సోనీ సెల్ఫీ కెమెరా మీకు అద్భుతమైన సెల్ఫీ వీడియోలు, చిత్రాలు తీసుకోడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
ఈ ఫోన్ సబ్‌మెరైనర్ బ్లూ, నావిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ అనే మూడు స్టైలిష్ రంగులలో అందుబాటులో ఉంది. ఇంకా Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల OLED డిస్‌ప్లే, 2412 x 1080 (FHD+) రిజల్యూషన్
- 8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్
- వెనకవైపు 64MP+ 50MP+8MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SUPERVOOC ఛార్జర్
ధరలు:
8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 29,999/-
8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 31,999/-
12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన మోడల్ ధర: రూ. 33,999/-
ఈ కొత్త ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 6 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.